Home
Mobile

5G Smartphones Under 25k రూ.25 వేల ధరలో లేటెస్ట్‌ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా.. ఇదిగో లిస్ట్‌..!

Best 5G Smartphones under Rs25000 : భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. ఇందులో ముఖ్యంగా బడ్జెట్‌ రేంజ్‌తోపాటు రూ.25 వేల ధర ఫోన్‌లకు డిమాండ్‌ అధికంగా ఉంది. ఈ ధరలో అనేక హ్యాండ్‌సెట్‌లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఐకూ, పోకో, CMF, మోటోరోలా, నథింగ్‌ వంటి ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్, డిజైన్ సహా అనేక ప్రత్యేకతలున్నాయి.

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్‌ తొలిసారిగా భారీగా బ్యాటరీతో లాంచ్‌ అయింది. రూ.25 వేల కంటే తక్కువ ధరలో బెస్ట్‌ హ్యాండ్‌సెట్‌గా ఉంది. ఈ ఫోన్ 90W ఛార్జింగ్‌ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. హెవీ యూజర్లకు ఈ హ్యాండ్‌సెట్ బైస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది.

Best Smartphones under Rs25000 Price in india

ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ (iQOO Z10 Smartphone) 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ గా ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

ఈ ఫోన్ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 (OIS), 2MP కెమెరాలను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాలను అమర్చారు. సర్కిల్‌ టూ సెర్చ్, AI Erase, AI సూపర్ డాక్యుమెంట్, AI నోట్‌ అసిస్ట్‌ ఫీచర్‌లున్నాయి.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ :
మోటోరోలా ఎడ్జ్‌ 60 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల 1.5K ఆల్‌ కర్వడ్‌ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ (Motorola Edge 60 Fusion) మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 68W వైర్‌ టర్బో ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700C (OIS) ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా, 3 ఇన్‌ 1 లైట్‌ సెన్సార్‌, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ స్మార్ట్‌ కనెక్ట్ 2.0, మోటో సెక్యూర్‌ 3.0, ఫ్యామిలీ స్పేస్‌ 3.0, మోటో గెశ్చర్స్, సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
CMF ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro) స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. panda గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ కోసం 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని సంస్థ వెల్లడించింది.

ఈ ఫోన్ 50MP (EIS) ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.20,999 గా ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Nothing Phone 3a) 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 50MP శాంసంగ్‌ కెమెరా (OIS, EIS), 50MP సోనీ కెమెరా (EIS), 8MP సోనీ అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 3a 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది.

పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Poco X7 Pro 5G) 6.73 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

ఈ ఫోన్‌ 50MP సోనీ LYT 600, 8MP అల్ట్రావైడ్‌, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI నోట్స్‌, AI ఇమేజింగ్‌, ఫోటో ఎడిటింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. 90W HyperCharge సపోర్టుతో 6550mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best Smartphones under Rs25000 Price in india here is the list and features 2025 May
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X