Home
Mobile

ధర రూ.25000 ధరలో మంచి 5G ఫోన్‌ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..!

స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్‌ అధికంగా ఉన్న మార్కెట్స్‌లో భారత్ ఒకటి. భారత్‌లో ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌ఫిష్‌ మోడల్స్ వరకు భారీ డిమాండ్‌ ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ మోడళ్లను స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు లాంచ్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రూ.25000 ధర సెగ్మెంట్‌ ధరలో (Best 5G Smartphones under Rs25000)బెస్ట్‌ ఫోన్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

రియల్‌మి P3 ప్రో 5G :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Realme P3 Pro 5G) ఇటీవల భారత్‌లో లాంచ్‌ అయింది. రేపటి నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది.

Best 5G Smartphones under Rs25000

వెనుక వైపు (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX896 కెమెరా, 2MP సెకండరీ కెమెరాలతోపాటు 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది.

రెడ్‌మి నోట్‌ 14 ప్రో 5G :
ఈ ఫోన్‌ (Redmi Note Pro 5G) 120Hz రీఫ్రెష్‌ రేట్‌ 6.67 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOSను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ A35 5G :
గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ 6.6 అంగుళాలు FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. Exynos 1380 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత శాంసంగ్‌ One UI 6.1 OS ను కలిగి ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జంగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్‌ (Samsung Galaxy A35 5G) 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 5MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్ 6.4 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హీలియో UI OS ను కలిగి ఉంది. 68W టర్బో ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో 4310mAh బ్యాటరీను కలిగి ఉంది.

ఈ ఫోన్ (Motorola Edge 50 Neo 5G) OIS సపోర్టుతో 50MP సోనీ LYT 700C కెమెరా, 13MP అల్ట్రావైడ్‌, 3X జూమింగ్‌తో 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best 5G Smartphones under Rs25000 Price range in india check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X