ధర రూ.10,000 కంటే తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్..!
భారత్ మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ ధర స్మార్ట్‌ఫోన్‌లకు అధిక డిమాండ్ ఉంది. ఫలితంగా అనేక సంస్థలు ఈ ధరలో వివిధ మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. రూ.10000 ధర సెగ్మెంట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ధరలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో హ్యాండ్‌సెట్‌లను రెడ్‌మి వంటి సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. 10k ధరలో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో 5G ఫోన్ల వివరాలు (Snapdragon Chipset Smartphones Under Rs10,000) మీకోసం.
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా (Redmi 14C 5G) వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.
రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 6GB ర్యా్మ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. స్టార్ గేజ్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

పోకో M6 ప్రో 5G :
ఈ పోకో హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP కెమెరా+ 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
పోకో M6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Poco M6 Pro 5G) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10978 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.11960 గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Redmi A4 5G) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్ పనిచేస్తోంది. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

రెడ్‌మి A4 5G ఫోన్ కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా సహా మరో సెకండరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.8,499 గా ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది.


Click it and Unblock the Notifications








