30 నిమిషాల్లో 62% ఛార్జింగ్! 6000-7000mAh బ్యాటరీ ఫోన్ల ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ ఫలితాలు ఇవే!
వర్షాకాలంలో దేశవ్యాప్తంగా పవర్ కట్స్ ఎక్కువవుతుంటాయి. దీంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. ముఖ్యంగా రోజంతా మొబైల్ వాడేవారికి ఫోన్ తొందరగా ఛార్జ్ కావడం అత్యవసరం. అందుకే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రముఖ 6,000–7,000mAh బ్యాటరీ ఫోన్లపై మా ల్యాబ్‌లో 30 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ నిర్వహించాం. కేవలం 1% ఛార్జింగ్ నుంచి మొదలుపెట్టి, 30 నిమిషాల్లో ఎంత పవర్ ఎక్కింది? ఫోన్ ఎంత వేడెక్కింది? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాం.
సాధారణంగా గేమర్లు, ప్రయాణికులు, ఆఫీసుకెళ్లేవారు రోజువారీ వాడకంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో సరిగ్గా అలాగే ఈ టెస్టింగ్ ప్రాసెస్ డిజైన్ చేశాం. ప్రాసెస్ మొత్తంలో 5G నెట్‌వర్క్, TWS ఈయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసే ఉంచాం. BIS సర్టిఫైడ్ కలిగిన 33W నుంచి 120W ఛార్జర్లను ఉపయోగించి ఈ టెస్ట్ జరిపాం. ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు వాటేజ్ స్పీడ్, ఫోన్ హీటింగ్ లెవల్స్‌ను నిశితంగా రికార్డ్ చేశాం.

6,000–7,000mAh బ్యాటరీ ఫోన్ల 30 నిమిషాల ఫాస్ట్-ఛార్జ్ ఫలితాలు
| ఫోన్ మోడల్ | బ్యాటరీ | ఛార్జర్ | 30 నిమిషాల్లో ఛార్జింగ్ | ఉష్ణోగ్రత పెరుగుదల |
|---|---|---|---|---|
| Realme GT 7 | 7000mAh | 120W | 62% | +4.2°C |
| iQOO 15 | 7000mAh | 100W | 55% | +3.8°C |
| Realme P3 Pro | 6000mAh | 80W | 58% | +3.5°C |
| iQOO Z9x | 6000mAh | 44W | 38% | +2.1°C |
ఎక్కువ వాటేజ్ ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతానికి పైగా ఛార్జ్ అయ్యాయి. రియల్‌మీ GT 7 ఫోన్ అత్యంత వేగంగా 62% ఛార్జింగ్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు ఐకూ 15 (iQOO 15) ఫోన్ ఎక్కువ వేడెక్కకుండానే 55% ఛార్జింగ్ పూర్తి చేసుకుంది. 80W, 120W ఛార్జర్లు ఉన్న డివైజ్లు చాలా వేగంగా, నమ్మకంగా పవర్ అందించాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఛార్జింగ్ కావడం వల్ల గేమర్లకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కరెంట్ లేని సమయంలో ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది.
ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా చూడటంలో థర్మల్ మేనేజ్‌మెంట్ కీలక పాత్ర పోషించింది. సాధారణ 44W అడాప్టర్లు తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసి, లాంగ్ టర్మ్‌లో బ్యాటరీ లైఫ్‌ను సురక్షితంగా ఉంచుతాయి. తరచూ పవర్ కట్స్ ఎదుర్కొనేవారు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ బ్యాక్ కవర్లు తీసేయడం మంచిది. అలాగే, సర్టిఫైడ్ కేబుల్స్, హీట్ ప్రొటెక్షన్ సపోర్ట్ ఉన్న ఒరిజినల్ ఛార్జర్లనే వాడాలి. ఒరిజినల్ అడాప్టర్లు వాడటం వల్ల వోల్టేజ్ సమస్యలు రావు, ఫోన్ కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
6,000–7,000mAh పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్ ఎంచుకుంటే ఛార్జింగ్ చింతే ఉండదు. వర్షాకాలంలో అకస్మాత్తుగా పవర్ పోయినా, ఎక్కువ వాటేజ్ ఉండే ఛార్జర్లు నిమిషాల్లోనే ఫోన్‌ను రీఛార్జ్ చేస్తాయి. చిన్న ఛార్జింగ్ బ్రేక్‌తో గేమర్లు, ట్రావెలర్లు, ఆఫీస్ వర్కర్లు రోజంతా ఫోన్ వాడేసుకోవచ్చు. సరిగ్గా టెస్ట్ చేసిన ఫోన్లను ఎంచుకోవడం వల్ల బ్యాటరీ హెల్త్ పాడవకుండా ఉండటంతో పాటు రోజూ మెరుగైన పెర్ఫార్మెన్స్ అందుతుంది.


Click it and Unblock the Notifications