Home
Mobile

రూ.5 వేల లోపు అదిరే మొబైల్ కొనాలనుకుంటున్నారా..మీకోసమే

By Gizbot Bureau

ఈ రోజుల్లో అందరూ ప్రీమియం ఫోన్ల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే అది అంత డబ్బు పెట్టి కొనుగోలు చేసిన తరువాత పనిచేయకుంటే అయ్యో అని బాధపడతాం. డబ్బులు ఏట్లో తగలేసినట్లుగా ఫీలవుతాం. మరి అలాంటి సమయంలో మనకి టక్కున గురుకు వచ్చేది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండే మొబైల్స్. మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి మొబైల్స్ చాలానే దొరుకుతున్నాయి. ఎవరైనా తక్కువ ఫీచర్లతో ఫోన్ కావాలనుకున్న వారు ప్రయత్నించవచ్చు. మినిమం ఫీచర్లు ఉంటే చాలు పని గడిచిపోతుందనుకునే వాళ్ల కోసం రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎదురుచూస్తున్నాయి. టాప్ బ్రాండింగ్ కంపెనీలకు చెందిన ఈ మొబైల్ ఫోన్లు 4జీ కనెక్టివిటీతో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

NOKIA 1

NOKIA 1

ధర : 4490

ఈ ఫోన్ యాండ్రాయిడ్ ఓరియో(గో ఎడిషన్)తో 1జీబీ ర్యామ్, మీడియా టెక్ ప్రాసెసర్ లతో పనిచేస్తుంది. తేలికపాటి ఫోన్ మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుంది. పైగా దీని కవర్ ను కూడా కావలసినట్లుగా మార్చుకోవచ్చు. 

స్క్రీన్ సైజ్ : 4.5" (480 x 854)

కెమెరా : 5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా | 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 

ర్యామ్ : 1 జీబీ

బ్యాటరీ : 2150 mAh

ఆపరేషన్ సిస్టమ్ : యాండ్రాయిడ్

ప్రొసెసర్ : క్వాడ్

XIAOMI REDMI GO 

XIAOMI REDMI GO 

ధర రూ.. 4750

రూ.5వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ లలో జియోమీ రెడ్ మీ గో రెండో స్థానంలో నిలిచింది. రేట్‌కు తగ్గట్లుగా కెమెరా డీసెంట్ పర్‌ఫార్మెన్స్ అందిస్తుంది. ఇంకోటి దీని ప్యానెల్ స్క్రాచ్ లు పడకుండా స్మూత్ లేయర్ తో ఉంది. 

షియోమీ రెడ్‌మీ గో ఫీచ‌ర్లు...

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

infinix smart 2

infinix smart 2

ధర రూ. 3,999

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

Lava Z60s 

Lava Z60s 

ధర : 4770

ఆండ్రాయిడ్ ఓరియా(గో ఎడిషన్)గా అందుబాటులో ఉంది. 1జీబీ ర్యామ్, 16జీబీ హార్డ్ డిస్క్. 1.1GHzతో మీడియా టెక్ ప్రొసెసర్ లు ఫోన్ ఫీచర్స్. లావా దీనికి రెండేళ్ల వారంటీ కూడా అందిస్తుంది. 

స్క్రీన్ సైజ్ : 5" (720 x 1080)

కెమెరా : 5 బ్యాక్ | 5 ఫ్రంట్ MP

ర్యామ్ : 1 జీబీ

బ్యాటరీ : 2500 mAh

ఆపరేటింగ్ సిస్టమ్ : యాండ్రాయిడ్ గో

ప్రొసెసర్ : Quad

MICROMAX BHARAT GO

MICROMAX BHARAT GO

ధర: 3990 

ఫీచర్ ఫోన్ వాడి తొలి సారి ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్లకు బెస్ట్ ఫోన్. గూగుల్ సూట్‌తో పాటు లైట్ యాప్స్‌తో పనిచేస్తుంది. దీంతో ఫోన్ మెమొరీ మాత్రమే కాకుండా డేటా వినియోగం కూడా తక్కువే అవుతుంది. స్క్రీన్ సైట్ 4.5అంగుళాలతో పాటు ముందు, వెనుక సమానంగా 5మెగా పిక్సెల్ కెమెరాతో రూపొందించారు. 

స్క్రీన్ సైజ్ : 4.5" (480 x 854)

కెమెరా : 5 | 5 MP

ర్యామ్ : 1 GB

బ్యాటరీ : 2000 mAh

ఆపరేటింగ్ సిస్టమ్ : యాండ్రాయిడ్

ప్రొసెసర్ : క్వాడ్

RELIANCE JIOPHONE

RELIANCE JIOPHONE

ధర : 1500

ఫేస్ బుక్, వాట్సప్ లతో పాటు జియోకు సంబంధించిన యాప్ లతో పనిచేస్తుంది. రూ.1500కు దొరుకుతున్న ఫోన్ మూడేళ్ల తర్వాత అదే అమౌంట్ క్యాష్ బ్యాక్ ద్వారా తిరిగి పొందొచ్చు. 2.4" (240 x 320)స్క్రీన్ సైజ్ , 2 | 0.3 MP కెమెరా, 512MB ర్యామ్, 2000 mAh బ్యాటరీ, KAI OS ఆపరేటింగ్ సిస్టమ్, Dual Core ప్రొసెసర్

Best Mobiles in India

English summary
best Android mobile phones below Rs. 5,000 in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X