రూ.30,000లోపు కెమెరా ఫోన్ల కోసం వెతుకుతున్నారా.. 2025 టాప్ పిక్స్ ఇవే!
2025లో రూ.30,000లోపు బడ్జెట్‌లో అద్భుతమైన కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లు కావాలనుకుంటే, మీకోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా బెస్ట్ ఫోన్‌ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం.
* రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్: పోర్ట్రెయిట్స్ కోసం బెస్ట్
ఈ ఫోన్‌లోని 50MP టెలిఫొటో లెన్స్ ఆఫర్ చేశారు. దీన్ని పోర్ట్రెయిట్‌ల కోసమే స్పెషల్ గా రూపొందించారు. ఇందులో నేచురల్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఉంటుంది కాబట్టి బెస్ట్ ఫొటోస్ వస్తాయి.

మెయిన్ కెమెరా: OISతో 50MP. ఇది కలర్‌ఫుల్, షార్ప్ ఫొటోలు తీస్తుంది.
అల్ట్రావైడ్ కెమెరా: 8MP, మంచి వెలుతురులో బాగా పనిచేస్తుంది.
సెల్ఫీ కెమెరా: 20MP, మంచి సెల్ఫీలు వస్తాయి.
ఇతర ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్ 7s Gen 3, HDR10+తో 120Hz AMOLED డిస్‌ప్లే, 90W ఛార్జింగ్‌తో 6,200mAh బ్యాటరీ.
ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్, ఇతర ఆఫర్లతో 30 వేలకే సొంతం చేసుకోవచ్చు.
* వివో V40e: సెల్ఫీల కోసం బెస్ట్
వివో V40eలో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది, ఇది షార్ప్, కలర్‌ఫుల్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం చాలా బాగుంటుంది.
మెయిన్ కెమెరా: OIS తో 50MP. దీనితో డైలీ బెస్ట్ ఫొటోలు తీసుకోవచ్చు.
అల్ట్రావైడ్ కెమెరా: 8MP, మంచి వెలుతురులో బాగా పనిచేస్తుంది.
ఇతర ఫీచర్లు: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 120Hz AMOLED డిస్‌ప్లే, 80W ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ.
* రియల్‌మీ 14 ప్రో ప్లస్: జూమ్ ఫోటోగ్రఫీకి బెస్ట్
రియల్‌మీ 14 ప్రో ప్లస్ ఈ ధరలో 50MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో వస్తున్న ఏకైక ఫోన్. ఇది 3x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. దూరంగా ఉన్న వస్తువులు, వన్యప్రాణులు లేదా ప్రకృతి దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది.
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కూడా ఉంది, అంటే తక్కువ వెలుతురులో కూడా ఫొటోలు షేక్ అవ్వకుండా వస్తాయి.
మెయిన్ కెమెరా: 50MP, షార్ప్, కలర్‌ఫుల్ ఫొటోలు.
అల్ట్రావైడ్ కెమెరా: 8MP, విశాలమైన దృశ్యాలను బాగా క్యాప్చర్ చేస్తుంది, అయితే ఇది మంచి వెలుతురులో ఇంకా బాగా పనిచేస్తుంది.
సెల్ఫీ కెమెరా: 32MP, క్లియర్, డీటైల్డ్ సెల్ఫీలు.
ఇతర ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్ 7s Gen 3, 120Hz OLED డిస్‌ప్లే, 80W ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15.
* మోటరోలా ఎడ్జ్ 50 ప్రో: ఆల్ రౌండర్
ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, OIS, f/1.4 వైడ్ అపెర్చర్‌తో వస్తుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా బ్రైట్, డీటైల్డ్ ఫొటోలను క్యాప్చర్ చేయగలదు.
టెలిఫొటో కెమెరా: 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP, పోర్ట్రెయిట్స్, క్లోజప్ షాట్లకు చాలా బాగుంటుంది.
అల్ట్రావైడ్ కెమెరా: 13MP, ఇది మాక్రో లెన్స్‌గా కూడా పనిచేస్తుంది, క్రియేటివ్ షాట్‌ల కోసం ఉపయోగపడుతుంది.
సెల్ఫీ కెమెరా: 50MP, షార్ప్, బెస్ట్ సెల్ఫీలు తీసుకోవచ్చు.
ఇతర ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్ 7 Gen 3, 144Hz OLED డిస్‌ప్లే, 125W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ, స్టాక్ ఆండ్రాయిడ్ 15.
* వన్‌ప్లస్ నార్డ్ 4
నార్డ్ 4లో 50MP మెయిన్ కెమెరా ఉంది, ఇది OIS ఫీచర్‌తో సహజమైన వెలుతురులో మంచి ఫొటోలను తీస్తుంది.
అల్ట్రావైడ్ కెమెరా: 8MP, గ్రూప్ ఫొటోలు, ల్యాండ్‌స్కేప్‌లకు అనుకూలంగా ఉంటుంది.
సెల్ఫీ కెమెరా: 16MP, క్లీన్‌గా ఉంటుంది కానీ ఎక్కువ డీటెయిల్స్ ఉండవు.
ఇతర ఫీచర్లు: 120Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ.
* నథింగ్ ఫోన్ (2a) ప్లస్: మినిమలిస్ట్
ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, OIS, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ రెండు లెన్స్‌లు డీటైల్డ్, కలర్‌ఫుల్ ఫొటోలు అందిస్తాయి.
సెల్ఫీ కెమెరా: 50MP, నేచురల్ టోన్స్‌తో హై-క్వాలిటీ సెల్ఫీలు.
ఇతర ఫీచర్లు: డైమెన్సిటీ 7350 ప్రో, 120Hz AMOLED డిస్‌ప్లే, 50W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ.
* దేన్ని ఎంచుకోవాలి
జూమ్ ఫొటోగ్రఫీ కోసం: రియల్‌మీ 14 ప్రో ప్లస్.
క్లీన్ సాఫ్ట్‌వేర్, ఆల్ రౌండర్ కోసం: మోటరోలా ఎడ్జ్ 50 ప్రో.
పోర్ట్రెయిట్స్ కోసం: రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్.
సింప్లిసిటీ కోసం: వన్‌ప్లస్ నార్డ్ 4.
సెల్ఫీల కోసం: వివో V40e.
డిజైన్ ఇష్టపడేవారి కోసం: నథింగ్ ఫోన్ (2a) ప్లస్.
ప్రతి ఫోన్ ఒక్కో విషయంలో ప్రత్యేకంగా ఉంటుంది, కాబట్టి మీ ఫొటోగ్రఫీ స్టైల్‌కు సరిపోయే ఫోన్‌ను ఎంచుకోండి.


Click it and Unblock the Notifications








