Best Camera Smartphones రూ.20,000 ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్‌లు, ధర వివరాలు..!
భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం అనేక బ్రాండ్ల ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే సంస్థలు వివిధ అంశాలను, యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తుంటాయి. భారీ డిస్‌ప్లే హ్యాండ్‌సెట్.. గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు.. మెరుగైన కెమెరా ఫీచర్‌లున్న ఫోన్‌లు.. భారీ బ్యాటరీ.. ధరలు.. ఇలా అనేక అంశాలను తనిఖీ చేసుకొని ఫోన్‌లను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం అనేక మంది యూజర్లు బెస్ట్ కెమెరా ఫోన్‌లను (Best Camera Smartphones) కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ ధర సెగ్మెంట్‌లలో మెరుగైన కెమెరాలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రూ.20,000 ధరలో బెస్ట్ కెమెరాలు కలిగిన (Best Camera Smartphones Under RS20,000) కొన్ని హ్యాండ్‌సెట్‌లను ఎంపిక చేసి మీకు అందిస్తున్నాం. ఈ జాబితాలో శాంసంగ్, మోటోరోలా, హానర్, రియల్‌మి హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A16 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A16 5G Smartphone) 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆరు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది. హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.17,398 గా ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా + 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఆటో ఫోకస్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.
హానర్ 200 లైట్ 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Honor 200 Lite 5G) 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 OS తో పనిచేస్తోంది. SGS 5-స్టా్‌ర్ డ్రాప్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 108MP AI పొర్ట్రెయిట్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. అమెజాన్‌లో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,998 గా ఉంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Realme Narzo Turbo 5G) 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. ప్రాసెసర్‌ను కలిగి ఉంది. రెయిన్ వాటర్ స్మార్ట్‌టచ్ ఫీచర్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI కెమెరాతోపాటు 2MP పొర్ట్రెయిట్ కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15699 గా ఉంది.
మోటో G85 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Moto G85 5G) 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటో G85 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషషన్) 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, LED ప్లాష్ లైట్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.17999 గా ఉంది.


Click it and Unblock the Notifications








