Best Camera Smartphones : రూ.20 వేల ధరలో మంచి కెమెరా ఫోన్‌ల కోసం చూస్తున్నారా..?
Best Camera Smartphones : భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇటీవల కాలంలో అనేక మంది యూజర్లు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తున్న సమయంలో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రూ.20 వేల ధర రేంజ్‌లోనూ మెరుగైన కెమెరాలతో అనేక ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు.
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (CMF Phone 2 Pro Smartphone) ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 50MP టెలిఫోటో లెన్స్ మరియు 119.5 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ట్రూలెన్స్ ఇంజిన్ 3.0 టెక్నాలజీని కలిగి ఉంది.
ఈ ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తోంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో F25 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Oppo F25 Pro Smartphone) ప్రారంభ ధర రూ.19995 గా ఉంది. కెమెరాపరంగా ఈ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్, 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20499 గా ఉంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ (OIS), 8MP అల్ట్రావైడ్, 5MP మ్యాక్రో కెమెరాలతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాలు FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. Exynos 1380 చిప్‌సెట్, Mali G68, ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తోంది.
ఈ ఫోన్ (Samsung Galaxy A35 5G Smartphone) 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








