రూ.20 వేల ధరలో మంచి డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్, స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
భారత్ మార్కెట్ లో రూ.20 వేల ధర సెగ్మెంట్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జనవరి నెలలో మరిన్ని మోడల్స్ విడుదల కానున్నాయి. ఇటీవల కాలంలో కెమెరా, ప్రాసెసర్‌తోపాటు మెరుగైన డిస్‌ప్లే వైపు యూజర్లు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రూ.20 వేల ధరలో మెరుగైన డిస్‌ప్లేతో అనేక ఫోన్లు ఉన్నాయి. ఇందులో మోటో G86 పవర్ 5G స్మార్ట్‌ఫోన్, ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G, రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ రెడ్‌మి ఫోన్ (Redmi Note 14 SE 5G) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ (Infinix Note 50s 5G Smartphone) ప్రారంభ ధర రూ.16999 గా ఉంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రిమేట్ SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
మోటోరోలా G86 పవర్ స్మార్ట్‌ఫోన్ :
ఈ మోటో ఫోన్ (Moto G86 Power 5G) ప్రారంభ ధర రూ.17999 గా ఉంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల సూపర్ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 3 ఇన్ 1 ఫ్లిక్కర్ సెన్సర్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








