Home
Mobile

Best Feature Phones ఫీచర్‌ ఫోన్‌లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ జాబితాను చెక్‌ చేయండి..!

భారత్‌ మార్కెట్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ బ్రాండ్‌లకు చెందిన అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికీ అనేక మంది యూజర్లు ఫీచర్‌ ఫోన్‌లను (Best Feature Phones) వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు ఫీచర్‌ ఫోన్‌లను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల ప్రముఖ ఫోన్‌ల తయారీ సంస్థలు అనేక ఫీచర్‌ ఫోన్‌లను విడుదల చేశాయి.

ఈ జాబితాలో HMD 110 4G ఫోన్‌, జియోభారత్‌ J1, HMD 105, నోకియా 105, జియోఫోన్‌ prima 4G, జియో భారత్‌ B1, జియో భారత్‌ K1 కార్బన్‌, నోకియా 2760 ఫ్లిప్‌ 4G, నోకియా 235 4G వంటి అనేక ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌ల ఫీచర్‌లు, స్పెసిఫికేషన్లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

Best feature phones

HMD 110 4G : ఈ ఫోన్‌ 1.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 1450mAh బ్యాటరీ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ బిల్ట్‌ ఇన్‌ యూపీఐను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ వైర్‌లెస్‌ FM రేడియో ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.2399 గా ఉంది.

HMD 105 ఫోన్‌ : ఈ ఫోన్ 1.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. బిల్ట్ ఇన్‌ UPI తో అందుబాటులో ఉంది. లిథియం అయాన్‌ 1000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు వైర్‌లెస్‌ FM రేడియో ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ ప్రస్తుత ధర రూ.999 గా ఉంది.

జియో భారత్‌ J1 : ఈ ఫోన్‌ 2.8 అంగుళాల డిస్‌ప్లేను (Jio Bharat J1) కలిగి ఉంది. దీంతోపాటు లిథియం అయాన్‌ 2500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ జియో యాప్స్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా జియో యాప్‌ ద్వారా UPI పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.1799 గా ఉంది.

నోకియా 105 : ఈ ఫీచర్‌ ఫోన్‌ 1.8 అంగుళాల డిస్‌ప్లేను (Nokia 105) కలిగి ఉంది. నోకియా సిరీస్‌ 30+ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాంపైన పనిచేస్తుంది. యూపీఐ పేమెంట్స్‌ ను సపోర్టు చేస్తుంది. లిథియం అయాన్‌ 1000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వైర్‌లెస్‌ FM రేడియో ఫీచర్‌ ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.1219 గా ఉంది.

జియో భారత్‌ B1 : ఈ ఫోన్‌ 2.4 అంగుళాల డిస్‌ప్లేను (Jio Bharat B1) కలిగి ఉంది. VGA కెమెరాతో అందుబాటులో ఉంది. లిథియం అయాన్‌ 2000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ UPI యాప్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా సులభంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. మరియు జియో యాప్స్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ధర రూ.1299 గా ఉంది.

నోకియా 235 4G : ఈ ఫోన్ 2.8 డిస్‌ప్లేను (Nokia 235 4G) కలిగి ఉంది. 1450mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 2MP కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతోపాటు FM రేడియో, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌తో పనిచేస్తుంది. క్లౌడ్‌ యాప్స్‌, యూట్యూబ్‌ సహా ఇతర ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ ఫోన్‌ ధర రూ.4099 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best feature phones with UPI support check specifications and price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X