12GB RAM ఫీచర్లతో గేమింగ్ కోసం అనువుగా ఉండే స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!!!

|

2020 సంవత్సరంలో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లను 8 జీబీ ర్యామ్ టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లతో విడుదల చేస్తున్నాయి. వీటితో పాటుగా గేమింగ్ కోసం అనువుగా ఉండడానికి వీలుగా దాదాపు అన్ని బ్రాండ్‌లు ఈ ఏడాది తమ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో 12GB ర్యామ్ ఫీచర్ ఫోన్లను కూడా విడుదల చేసారు. వీటిలో కొన్ని 8GB ర్యామ్ మోడల్ మాత్రమే కలిగి ఉండగా మరికొన్ని టాప్-ఎండ్ ఆప్షన్స్ 12GB RAM ఫీచర్లతో ప్యాక్ చేయబడి వస్తున్నాయి. శామ్‌సంగ్, వన్‌ప్లస్, రియల్‌మి, ఒప్పో వంటి ఇతర బ్రాండ్లు కూడా గేమింగ్ కోసం 'అత్యంత శక్తివంతమైన' ఫోన్‌లను విడుదల చేసారు. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 2 5G

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 2 5G

శామ్సంగ్ యొక్క తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - గెలాక్సీ Z ఫోల్డ్ 2 5G - 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌ మరియు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ కంపెనీ సొంత వన్ యుఐతో అగ్రస్థానంలో ఉంచుతుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 5G యొక్క ధర 1,49,999 రూపాయలు.

Also Read:ధర.25,000 లలో బెస్ట్ ఫోన్లు ఇవే! ధరలు మరియు ఫీచర్ లు చూడండి. Also Read:ధర.25,000 లలో బెస్ట్ ఫోన్లు ఇవే! ధరలు మరియు ఫీచర్ లు చూడండి.

OnePlus Nord
 

OnePlus Nord

వన్‌ప్లస్ సంస్థ మిడ్-రేంజ్ ధరలో 12GB ర్యామ్ ఆప్షన్‌లో విడుదల చేసిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ - వన్‌ప్లస్ నార్డ్. ఇది 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. రూ.29,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో గల ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌తో రన్ అవుతూ గేమింగ్ కోసం అనువుగా ఉంటుంది. అలాగే ఇది వార్ప్ ఛార్జ్ సపోర్ట్‌తో 4115mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా

శామ్‌సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా

శామ్‌సంగ్ సంస్థ మొదటి సారి 108MP కెమెరా ఫీచర్లతో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S20 అల్ట్రా. ఇది కూడా 12GB ర్యామ్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతున్న ఈ ఫోన్ గేమింగ్ కోసం ఎటువంటి ఆటంకం కలగకుండా సజావుగా కొనసాగడానికి వీలుగా 6.9-అంగుళాల క్వాడ్ హెచ్‌డి + ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిని రూ.97,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ సొంత ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

OPPO Find X2

OPPO Find X2

ఒప్పో సంస్థ 2020 సంవత్సరంలో ఇటీవల ప్రారంభించిన కొత్త ఫోన్ ఒప్పో ఫైండ్ X2 కూడా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 48MP మెయిన్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 65W సూపర్‌వూక్ 2.0 ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో 4200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ ను 64,990 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Also Read:Infinix Note 7 కొత్త స్మార్ట్‌ఫోన్ తక్కువ ధర వద్దనే లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం... Also Read:Infinix Note 7 కొత్త స్మార్ట్‌ఫోన్ తక్కువ ధర వద్దనే లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం...

Asus ROG Phone 3

Asus ROG Phone 3

ఆసుస్ నుండి వచ్చిన సరికొత్త గేమింగ్ ఫోన్ ఆసుస్ ROG ఫోన్ 3 కూడా 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. 57,999 రూపాయల ధర వద్ద లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 4500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 7 మాగ్నెట్ స్టీరియో స్పీకర్లు మరియు క్వాడ్ మైక్రోఫోన్లతో వస్తుంది.

రియల్‌మి X3 సూపర్ జూమ్

రియల్‌మి X3 సూపర్ జూమ్

రియల్‌మి X3 సూపర్ జూమ్ స్మార్ట్‌ఫోన్ 64MP క్వాడ్-రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండి 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఫీచర్లతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ టెక్నాలజీతో 4200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.32,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Best Gaming Features Smartphones 2020: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X