Gaming Smartphones రూ.20000 ధరలో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్, ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు..!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్ అతి పెద్ద మార్కెట్ గా ఉంది. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు భారీ డిమాండ్ ఉంటోంది. ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు ఉన్న ఇండియాలో బడ్జెట్, ఎంట్రీ లెవర్ సెగ్మెంట్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. దీంతోపాటు గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రూ.20,000 ధరలో మెరుగైన పనితీరు అందించే ఫోన్ లు మీకోసం.
ఈ జాబితాలో ప్రస్తుతం ఇటీవల అందుబాటులోకి (Gaming Smartphones) వచ్చిన రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ తోపాటు పోకో X6 ప్రో, రియల్‌మి నార్జో 70 టర్బో, శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్‌లు ఉన్నాయి. ఈ మోడల్స్ అన్ని కూడా రూ.20,000 కంటే తక్కువ ధరకు ప్రస్తుతం భారత్ లో ఉందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3 5G స్మార్ట్ ఫోన్ (Realme P3 5G Smartphones) ఇటీవల అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు ProXDR సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
రియల్‌మి హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68+ IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. 1.5 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాల వరకు డ్యామేజీ కాకుండా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.16,999 గా ఉంది.
పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్ :
పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Poco X6 Pro 5G Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ పోకో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Mail G615 GPU తో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. NFC, IR బ్లాస్టర్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 64MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. మరియు డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G హ్యాండ్‌సెట్ (Realme Narzo 70 Turbo Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది.
గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయంలో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్, AI బూస్ట్ ఇంజిన్ 2.0 ను కలిగి ఉంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, AI Eye ప్రొటెక్షన్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP పొర్ట్రెయిట్ లెన్స్, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ రియల్‌మి ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,414 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,489, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,490 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ :
గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M35 5G Smartphone) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ పొందుతుంది. ఆక్టాకోర్ Exynos 1380 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Mali G68 MP5 GPU చిప్‌సెట్ కూడా కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6 OS ను కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాలను అమర్చి ఉంది.
సెక్యూరిటీ కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోపాటు డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14199 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18699 గా ఉంది.


Click it and Unblock the Notifications








