2018లో లాంచ్ అయిన బెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు
2018కుగాను అనేక మిడ్-రేండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి.
2018కుగాను అనేక మిడ్-రేండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు పనితీరు పరంగా యావరేజ్ రివ్యూలను సొంతం చేసుకోగా, మరికొన్ని మాత్రం పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

షావోమి పోకో ఎఫ్1 (Xiaomi Poco F1)
2018కి గాను ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన బెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో షావోమి పోకో ఎఫ్1 (Xiaomi Poco F1) ఒకటి. స్నాప్‌డ్రాగన్ 845 (Snapdragon 845) మొబైల్ చిప్‌సెట్‌తో లాంచ్ అయిన చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి పోకో ఎఫ్1 గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ.20,999, రూ.23,999, రూ.28,999 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

రియల్‌మి 2 ప్రో (Realme 2 Pro)
ఈ జాబితాలో రెండవది రియల్‌మి 2 ప్రో. మోస్ట్ అడ్వాన్సుడ్ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ మిడ్-రేంజ్ డివైస్ మొత్తం మూడు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ.13,990, రూ.15,990, రూ.17,990 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ఆసూస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 (Asus Zenfone Max Pro M1)
ఈ జాబితాలో మూడవది ఆసూస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1. స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌కు శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మిడ్-రేంజ్ డివైస్ కూడా మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మూడవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమవుతున్నాయి. వీటి ధరలు మోడల్‌ను బట్టి రూ.10,999, రూ.12,999, రూ.14,999 వద్ద ట్రేడ్ అవుతోంది.

షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రో (Xiaomi Redmi Note 5 Pro)
ఈ జాబితాలో నాల్గవది షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రో. డ్యుయల్ కెమెరా మాడ్యుల్‌తో లాంచ్ కాబడిన ఈ మొట్టమొదటి మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ డివైస్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందుబాటులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.13,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.16,999.

హానర్ ప్లే (Honor Play)
ఈ జాబితాలో ఐదవది హానర్ ప్లే (Honor Play). ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో కెమెరా పనితీరు అత్యుత్తమంగా ఉంటుంది. ఇదే సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఫోన్ వినియోాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈ డివైస్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.19,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.23,999.

నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus)
ఈ జాబితాలో ఆరవది నోకియా 6.1 ప్లస్ (Nokia 6.1 Plus). నోకియా నుంచి లాంచ్ అయిన మొట్టమొదటి మిడ్-రేజ్ నాట్చ్ ఫోన్ కూడా ఇదే కావటం విశేషం. ఈ ఫోన్‌ను 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.15,999.

హానర్ 9ఎన్ (Honor 9N)
హానర్ 9ఐ (2018) గ్లోబల్ వేరియంట్‌గా లాంచ్ అయిన హానర్ 9ఎన్ (Honor 9N) మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.11,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ధర రూ.13,999. మూడవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ధర రూ.17,999.

వివో వీ9 (Vivo V9)
2018లో లాంచ్ అయిన బెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో వివో వీ9 ఒకటి. ఈ ఫోన్ 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.22,990. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ యాక్సిస్ ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్‌గా చెప్పుకోవచ్చు. 19:9 నాట్చ్ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

ఒప్పో ఎఫ్9 ప్రో (Oppo F9 Pro)
ఈ లిస్టులో చివరిది ఒప్పో ఎఫ్9 ప్రో. VOOC ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ను 5 నిమిషాలు ఛార్జ్ చేసినట్లయితే రెండు గంటల యూసేజ్ టైమ్ మనకు లభిస్తుంది.ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.19,990. రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.23,990.


Click it and Unblock the Notifications








