రూ.15000లో బెస్ట్ ‘పైసా వసూల్’ ఫోన్స్
ఈ దీపావళిని పురస్కరించుకుని రూ.15000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలను కుంటున్నారా..? అయితే మీ కోసం పలు బెస్ట్ ఆప్షన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

షావోమి ఎంఐ ఏ1 (Xiaomi Mi A1)
మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో Xiaomi Mi A1 ఒకటి. ఈ
ఫోన్‌లో చిన్నచిన్న లోపాలను పక్కన పెడితే, ఓవర్‌ఆల్‌గా ఫోన్ పనితీరు మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్యాటరీ డిపార్ట్‌మెంట్ అలానే ఫోటోగ్రఫీ విభాగాల పై షావోమీ మరింత ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..
5.5 - ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ (Samsung Galaxy J7 Prime)
సామ్‌సంగ్ నుంచి ఈ ఏడాది లాంచ్ అయిన బెస్ట్ బడ్జెట్ ప్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ జే7 ప్రైమ్ ఒకటి. ఈ ఫోన్‌కు సంబంధించిన స్ర్కీన్ అలానే డిజైనింగ్ విభాగాలను ప్రొఫెషనల్ స్థాయిలో సామ్‌సంగ్ తీర్చిదిద్దింది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1920x 1080పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

మోటో జీ5ఎస్ (Moto G5S)
మోటారోలా నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో Moto G5S ఒకటి. ఈ ఫోన్‌లో ఒక్క కెమెరా పెర్ఫామెన్స్ తప్పితే మిగిలిన అన్ని విభాగాలు బెస్ట్ క్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తాయి. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

షావోమి రెడ్‌మి నోట్ 4 (Xiaomi Redmi Note 4)
ఈ ఏడాదికిగాను అత్యధికంగా అమ్ముడుపోయిన బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో షావోమి రెడ్‌మి నోట్ 4 ఒకటి. ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 నెలలు కావొస్తున్నప్పటికి ఇంకా ఆదరణ తగ్గలేదు. రూ.15,000 బెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి రెడ్‌మి నోట్ 4 కూడా ఒక మంచి ఆప్షనే.
స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

మోటో జీ5 ప్లస్ (Moto G5 Plus)
ఇటీవల భారీ ధర తగ్గింపును అందుకున్న లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో మోటో జీ5 ప్లస్ ఒకటి. ఈ న్‌లో బిల్డ్ క్వాలిటీతో పాటు డిస్‌ప్లే విభాగాలు ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.


Click it and Unblock the Notifications








