Home
Mobile

ఫొటోగ్రఫీ లవర్స్‌కి బెస్ట్ ఫోన్స్.. కేవలం రూ.20,000 లోపు అందంగా ఫోటోలను తీసే కెమెరా ఫోన్లు ఇవే..!

Best camera phones : తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ కెమెరాలున్న ఫోన్ కావాలా, అయితే మీకోసం చాలా ఆప్షన్లు ఉన్నాయి. రూ.20,000లోపు చాలా ఫోన్లు సూపర్ కెమెరాలతో వస్తున్నాయి. శాంసంగ్, వివో, రెడ్‌మీ, రియల్‌మీ, వన్‌ప్లస్ లాంటి బ్రాండ్లు బడ్జెట్ ధరల్లోనే శక్తివంతమైన కెమెరాలతో ఫోన్లను అందిస్తున్నాయి. భారీ డిస్‌ప్లేలు, బ్యాటరీలతో కూడా ఆఫర్ చేస్తున్నాయి. మార్చి నాటికి మార్కెట్లోకి వాటిలో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్లలో కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం.

* శాంసంగ్ గెలాక్సీ M55 5G: మల్టీమీడియా లవర్స్‌కి బెస్ట్
శాంసంగ్ గెలాక్సీ M55 5G ధర రూ.17,999. చూడటానికి చాలా సన్నగా ఉంటుంది. డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకే ఈ ఫోన్ మల్టీమీడియా వాడేవాళ్లకి బాగా నచ్చుతుంది. ఇందులో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

Best Phones for Photography

వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. డే లైట్ ఫొటోలు బాగానే వస్తాయి కానీ, తక్కువ వెలుతురులో మాత్రం ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది అనిపిస్తుంది. రాతి పూట తప్పితే మిగతా అన్ని సమయాల్లో ఇది చాలా మెరుగ్గా ఫోటోలు తీస్తుంది.

ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 1 చిప్‌సెట్ అందించారు. 8GB RAMతో ఇది వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. లైట్ గేమ్స్ ఎంతసేపైనా ఆడుకోవచ్చు. 5000mAh బ్యాటరీ ఉంటుంది, కాబట్టి బ్యాటరీ బ్యాకప్ ఒక రోజు పాటు ఈజీగా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కానీ బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వడం లేదు.

* వివో T3 5G
వివో T3 5G ధర రూ.18,499. ఈ ఫోన్‌లో పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది, కెమెరాలు కూడా చాలా బాగుంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 8GB RAM తో వస్తోంది. దీనివల్ల ఫోన్ స్మూత్ గా పనిచేస్తుంది, ఏ పనైనా వేగంగా చేసుకోవచ్చు. 6.67-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది వస్తుంది.

కెమెరాల దగ్గరికి వస్తే వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కానీ ఈ ఫోన్‌లో చాలా యాప్స్ ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మాత్రం రెండే ఇస్తారు.

* రెడ్‌మీ నోట్ 14 5G: ఫొటోగ్రఫీ లవర్స్‌కి ఇదొక వరం
రెడ్‌మీ నోట్ 14 5G ధర రూ.17,998. తక్కువ ధరలో మంచి కెమెరా ఫీచర్లు కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 50MP మెయిన్ కెమెరాకి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ ఇచ్చారు. దీనివల్ల ఫొటోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్‌గా వస్తాయి. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.

సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు, అది కూడా చాలా క్వాలిటీతో ఫొటోలు తీస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్, 6GB RAMతో వస్తోంది. 6.67-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. 5110mAh బ్యాటరీ ఉంటుంది, ఇందులో కొన్ని యాప్స్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉండటం మైనస్.

* రియల్‌మీ P2 ప్రో
రియల్‌మీ P2 ప్రో ధర రూ.18,290. డిజైన్‌కి, ఫాస్ట్ ఛార్జింగ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్లకి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. ఇందులో 6.7-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. పిక్చర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 2 ప్రాసెసర్, 8GB RAMతో వస్తోంది.

రోజువారీ పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. కెమెరాల విషయానికొస్తే 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే 5200mAh బ్యాటరీ, సూపర్ ఊక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్. చార్జింగ్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. దీని కెమెరా క్వాలిటీతో సంతృప్తి కలుగుతుంది.

* వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G ధర రూ.17,998. స్టైల్, కెమెరా, బ్యాటరీ లైఫ్.. అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలనుకునేవాళ్లకి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్. 6.67-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 695 చిప్‌సెట్, 8GB RAMతో వస్తోంది.

కెమెరాలు:
ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కానీ తక్కువ వెలుతురులో కెమెరా పర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రాసెసర్ కాస్త పాత మోడల్ కావడంతో చాలా కాలం వాడితే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పలేం. 5500mAh బ్యాటరీ ఉంటుంది, సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

* మీకోసం ఏది బెస్ట్?
ఈ ఫోన్లలో ఒక్కొక్కటి ఒక్కో స్పెషాలిటీతో వస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M55 5G అయితే మల్టీమీడియా లవర్స్‌కి మంచి ఎంపిక, ఎందుకంటే డిస్‌ప్లే చాలా బాగుంటుంది. వివో T3 5G పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది, గేమ్స్ ఆడేవాళ్లకి, హెవీ యూజర్స్‌కి బాగా నచ్చుతుంది.

రెడ్‌మీ నోట్ 14 5Gలో OIS కెమెరా ఉండటం వల్ల ఫొటోలు చాలా స్టేబుల్‌గా వస్తాయి, ఫొటోగ్రఫీకి ఇష్టపడేవాళ్లకి ఇది బెస్ట్. రియల్‌మీ P2 ప్రో స్టైలిష్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ తో అదరగొడుతుంది. వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G బ్యాలెన్స్‌డ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు, మంచి బ్యాటరీ లైఫ్, డే లైట్ ఫొటోగ్రఫీ అందిస్తుంది.

మీ అవసరాలు, బడ్జెట్‌ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. తక్కువ ధరలో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్లు బెస్ట్ ఆప్షన్స్.

FAQs
మొబైల్ ఫోన్ స్లో అయ్యిందా? దాన్ని వేగంగా ఎలా చేయాలి?

క్యాచి క్లీన్ చేయండి.
అవసరం లేని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
స్టోరేజ్‌ను ఖాళీ చేయండి.
ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.
ఫ్యాక్టరీ రీసెట్‌ను చివరి ఆప్షన్‌గా పరిశీలించండి.

మొబైల్ డేటా వేగంగా పనిచేయడం లేదంటే ఏం చేయాలి?

డేటా కలిమిట్ చెక్ చేయండి.
ఫోన్ రీస్టార్ట్ చేయండి.
డేటా మోడ్ (4G/5G) చెక్ చేయండి.
నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయండి.

మొబైల్ స్క్రీన్ బ్రేక్ అయితే ఏం చేయాలి?

సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లండి.
తాత్కాలికంగా స్క్రీన్ గార్డ్ లేదా టెంపర్డ్ గ్లాస్ ఉపయోగించండి.
సెకండ్ హ్యాండ్ లేదా రెఫర్బిష్డ్ స్క్రీన్‌ని కొనుగోలు చేసే ముందు పరిశీలించండి.

GizBot Technology
Best Mobiles in India

English summary
Best Phones for Photography Lovers Top Camera Phones Under Rs. 20000 for Stunning Photos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X