Home
Mobile

Year Ender 2024 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఈ సంవత్సరం విడుదలైన బెస్ట్‌ ఫోన్‌లు ఇవిగో..!

భారత్‌ మార్కెట్లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ జాబితాలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రీమియం హ్యండ్‌సెట్‌లు ఉన్నాయి. అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఎంట్రీ, బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ప్రీమియం ఫోన్‌లకు కూడా భారీ డిమాండ్‌ ఉంది. ఈ సంవత్సరం తొలి నుంచే చూస్తే శాంసంగ్‌, గూగుల్‌, ఆపిల్‌, ఐకూ, వివో, ఒప్పో సహా మరిన్ని సంస్థలు ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లను లాంచ్ చేశాయి.

2024 సంవత్సరంలో శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ S24 సిరీస్‌లో భాగంగా అల్ట్రా వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే విధంగా గూగుల్‌ పిక్స్‌ 9 సిరీస్‌లో భాగంగా పిక్సల్‌ 9 ప్రో XL ఫోన్‌ విడుదల అయింది. దీంతోపాటు మరో ప్రముఖ సంస్థ ఆపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

best-premium-smartphones-india-2024

వీటితోపాటు మరో ప్రముఖ సంస్థ వివో ఇటీవల తన వివో X200 సిరీస్‌లో భాగంగా X200 ప్రో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇటీవల ఐకూ 13 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఒప్పో ఫైండ్‌ X8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మరికొన్ని సంస్థలు కూడా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌లను లాంచ్‌ చేశాయి.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ (Samsung Galaxy S24 Ultra) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.80 అంగుళాల QHD+ డైనమిక్ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా అత్యంత నాణ్యమైన కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 200MP+ 12MP+ 50MP +10MP సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

best-premium-smartphones-india-2024

ఈ అల్ట్రా మోడల్‌ 256GB, 512GB, 1TB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 OS పైన పనిచేస్తోంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుత ప్రారంభ ధర సుమారు రూ.96,490 గా ఉంది. వైలెట్‌, గ్రే, బ్లాక్‌, టైటానియం యెల్లో, టైటానియం వైలెట్‌ రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (iPhone 16 Pro Max) 3nm A18 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 6.9 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 48MP + 48MP + 12MP కెమెరాలు సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4685mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉంది.

best-premium-smartphones-india-2024

గూగుల్‌ పిక్సల్‌ 9 ప్రో XL స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 9 Pro XL) 6.80 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. గూగుల్‌ టెన్సార్‌ G4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP + 48MP + 48MP కెమెరాలతోపాటు 42MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5060mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 256GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1,24,999 గా ఉంది.

ఒప్పో ఫైండ్‌ X8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Oppo Find X8 Pro) 6.78 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 50MP + 50MP + 50MP + 50MP కెమెరాలు సహా 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 5,910mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.99,999 గా ఉంది.

best-premium-smartphones-india-2024

వివో X200 ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Vivo X200 Pro) 6.78 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ 1.5 LTPO OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 30W వైర్‌లెస్‌, 90W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP + 200MP + 50MP కెమెరాలు సహా 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది.

ఐకూ 13 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఐకూ స్మార్ట్‌ఫోన్ (iQOO 13 5G) 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్‌ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 50MP + 50MP + 50MP కెమెరాలు సహా 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.59,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best premium smartphones launched in 2024 here is the list and features, price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X