RS.15000 లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియాలోని చాలా మంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడం కోసం అధికంగా ఖర్చు చేయడాన్ని ఇష్టపడరు. కాని వారి యొక్క అన్ని అవసరాలకు తగిన విధంగా అన్ని ఫీచర్లను కలిగి ఉన్న వాటిలో డాష్ ఆఫ్ స్టైల్, గొప్ప కెమెరాలు మరియు పెద్ద బ్యాటరీలు వున్న వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. వివిధ రకాల బ్రాండ్ల నుండి కనీసం డజను స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మార్కెట్ లో రూ.15,000 లోపు ధర వద్ద లభిస్తున్నాయి.

ఫోన్‌లు
 

ముఖ్యంగా ఇప్పుడు 2019 సంవత్సరం ముగుస్తున్నందున కొన్ని వారాల క్రితం ప్రారంభించిన కొన్ని కొత్త ఫోన్‌లతో పాటు కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన ఖరీదైన పాత ఫోన్‌లు ప్రస్తుతం రూ.15,000 ధరల లోపు ట్యాగ్ ను కలిగి ఉన్నాయి. ఈ సమయంలో పాత మరియు క్రొత్త ఫోన్‌లలో ఏది ఉత్తమంగా ఉంది అని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్

రూ .15 వేలలోపు ధరలో కొనడానికి ఉత్తమంగా వున్న స్మార్ట్‌ఫోన్‌లు

రూ .15 వేలలోపు ధరలో కొనడానికి ఉత్తమంగా వున్న స్మార్ట్‌ఫోన్‌లు

రెడ్‌మి నోట్ 8 ప్రో (రూ .14,999)

షియోమి సంస్థ నుండి వచ్చిన రెడ్‌మి నోట్ సిరీస్ లోని తాజా మోడల్ - రెడ్‌మి నోట్ 8 ప్రో ఈ ధర పరిధిలో చాలా ఉత్తమమైనది. ఇది 6.5-అంగుళాలతో షియోమి అన్ని ఫోన్‌లో కంటే అతిపెద్ద డిస్ప్లేను కలిగి ఉంది. ఇది సన్నని బెజెల్స్‌తో IPS LCD స్క్రీన్‌తో వస్తుంది. రెడ్‌మి నోట్ 8 ప్రో మొబైల్ గేమింగ్‌ కోసం ప్రత్యేకమైన మీడియాటెక్ హెలియో G90T చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది లిక్విడ్-కూలింగ్ సిస్టమ్ మరియు 6 జిబి ర్యామ్‌తో జత చేయబడి వస్తుంది. 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సిస్టమ్ ఫోటోగ్రఫీను కలిగి ఉంది. ఇది 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీను కలిగి ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.

నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్... బడ్జెక్ట్ ధరలో...హైలైట్స్

రియల్‌మి 5ప్రో  (రూ .13,999)
 

రియల్‌మి 5ప్రో (రూ .13,999)

15 వేల లోపు స్నాప్‌డ్రాగన్ 712 చిప్‌సెట్‌ను అందించే కొన్ని ఫోన్‌లలో రియల్‌మి 5 ప్రో ఒకటి. ఈ ఫోన్ 6.3-అంగుళాల ఫుల్ HD డిస్ప్లేను కలిగి ఉండి 4035mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ ఒప్పో యొక్క VOOC 3.0 20W ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కెమెరాల విషయానికి వస్తే ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే రియల్‌మి 5 ప్రో ప్లాస్టిక్ బాడీను కలిగి ఉండి బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్‌తో జత చేయబడి ఉంటుంది.

థియేటర్ కంటే ఖరీదైన Samsung Wall TV రిలీజ్... ధర చాలా ఎక్కువ

మోటరోలా వన్ విజన్ (రూ .14,999)

మోటరోలా వన్ విజన్ (రూ .14,999)

రూ.15,000 కన్నా తక్కువ ధర వద్ద కొనుగోలు చేయగల అత్యంత ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ లలో ఇది ఒకటి. వన్ విజన్ 21: 9 రేషియోతో 6.3-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో గ్లాస్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. ఇది శామ్‌సంగ్ ఎక్సినోస్ 9609 చిప్‌సెట్‌ ఆధారంగా పనిచేస్తుంది. అలాగే స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 3,500mAh బ్యాటరీ మరియు 48-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

నోకియా నుండి మొదటి 4K స్మార్ట్ టీవీ ఇండియాలో రిలీజ్.. ధర ఎంతో చూడండి

పోకో ఎఫ్ 1 (రూ .14,999)

పోకో ఎఫ్ 1 (రూ .14,999)

షియోమి ఫ్లాగ్‌షిప్ లో స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌ను కలిగి వున్న చౌకైన ఫోన్లలో పోకో ఎఫ్ 1 ఒకటి. ఇది మందమైన బెజెల్ మరియు ప్లాస్టిక్ బాడీ నిర్మాణంను కలిగి ఉండి పాతదిగా అనిపించవచ్చు కానీ పనితీరు విషయానికి వస్తే అది గొప్పగా ఉంది. మీరు ఎక్కువ గేమ్స్ ఆడటానికి ఇష్టపడితే స్నాప్‌డ్రాగన్ 845 చిప్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇది 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. IR బేస్డ్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ ఉన్న కొన్ని ఫోన్‌లలో ఇది ఒకటి. పోకో ఎఫ్ 1 ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లో MIUI 11 ఆన్‌బోర్డ్‌లో ఉంది.

శామ్‌సంగ్ M30s  (రూ.13,999)

శామ్‌సంగ్ M30s (రూ.13,999)

శామ్సంగ్ దాని దూకుడును ఇంకా కొనసాగిస్తూనే ఉంది. గెలాక్సీ M30s దీనికి మరో మంచి ఉదాహరణ. ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండి శామ్సంగ్ యొక్క సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కు మద్దతును కలిగి ఉంది. ఇది 6.4-అంగుళాల FHD + సూపర్ AMOLED డిస్ప్లే మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ క్లాసిక్ గా కనిపిస్తుంది కానీ మీకు మరింత స్టైల్ కావాలంటే గ్రేడియంట్ కలర్స్ ఎంచుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Smartphones Under Rs. 15,000 in December 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X