బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ రూ.15,000 ధరల్లో

|

నేటితరం యువత స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో స్మార్ట్ ఫీచర్లు తప్పనిసరి కావటంతో డిమాండ్ అధికంగా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ కెమెరా ఫీచర్‌ను కలిగి రూ.15000 ధరల్లో లభ్యమవుతున్నఉత్తమ ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందు పొందుపరుచుతున్నాం.

 

ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్టు పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగి పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.'

మొబైల్ ఫోన్ వినియోగం అధికమవుతున్న నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు మొబైల్ వాడకం శృతిమించ కూడదని హెచ్చరిస్తున్నాయి. న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్న బాధితుల్లో అధికశాతం మంది సెల్ కారణంగా సమస్యలను కొనితెచ్చుకుంటున్నవారేనట. మొబైల్ ను అధికంగా ఉపయోగించటం కారణంగా తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, చెవి సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

Best Smartphones Under Rs 15000

Best Smartphones Under Rs 15000

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ16 హెచ్‌డి:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.12,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ రూ.15,000 ధరల్లో

బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ రూ.15,000 ధరల్లో

కార్బన్ ఎస్5 టాటానియమ్

5 అంగుళాల కెసాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,999.

 

జోలో క్యూ 1000
 

జోలో క్యూ 1000

జోలో క్యూ 1000

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ రేర్ కెమెరా,
1.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.13,369
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా లూమియా 620

నోకియా లూమియా 620

నోకియా లూమియా 620:

3.8 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై, బ్లూటూత్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్పైస్ స్టెల్లార్ పిన్నాకిల్ ప్రోమై 535

స్పైస్ స్టెల్లార్ పిన్నాకిల్ ప్రోమై 535

స్పైస్ స్టెల్లార్ పిన్నాకిల్ ప్రోమై 535:

5.3 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.13,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X