Home
Mobile

ధర రూ.20 వేల లోపు, మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోన్లు ఇవే !

By Maheswara

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ధర రూ.15,000 నుండి ధర రూ.20,000 మధ్య ఉన్న ఫోన్లకు భారీ డిమాండు ఉన్న సంగతి తెలిసిందే.ఈ ధరల లో మంచి ఫీచర్ లతో ఎక్కువ రకాల ఫోన్లు అందుబాటులో ఉండడం తో,పోటీ చాల కఠినంగా ఉంటుంది.కానీ ఎక్కువ శాతం మొబైల్ లు అమ్మకాలు జరిగేది కూడా ఈ ధర ల లోనే. అందుకే ఈ నెల లో మార్కెట్లో ఉన్న ఫోన్ల లో ఉత్తమమైన ఫోన్లు ఏవో మీకు అందిస్తున్నాము.

Xiaomi Redmi Note 9 Pro Max

Xiaomi Redmi Note 9 Pro Max

షియోమీ నుండి రెడీమి నోట్ సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్. ఇవి ఇండియాలో మూడు వేరు వేరు వేరియంట్ లలో లభిస్తాయి. ఈ ‌ఫోన్‌లపై ఇటీవల GST రేట్లను పెంచిన తర్వాత ఈ ఫోన్‌ల ధరలను కూడా సవరించారు. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.16,499, గా ఉంది. ఈ ఫోన్ అరోరా బ్లూ, వైట్ మరియు ఇంటర్స్టెల్లార్ బ్లాక్ వంటి మూడు కలర్ లలో వస్తుంది.అమెజాన్ ఇండియా మరియు షియోమీ అధికారిక వెబ్సైటు లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

Motorola One Fusion+

Motorola One Fusion+

మోటోరోలా వన్ సిరీస్ లో కొత్త గా విడుదల చేసిన ఈ మోటోరోలా వన్ ఫ్యూషన్ ప్లస్ ఫోన్, పాప్ అప్ సెల్ఫీ కెమెరా ఫీచర్ తో వస్తుంది.మోటరోలా వన్ ఫ్యూజన్ + స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC ప్రాసెసర్ కలిగిఉంటుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్ - HD + డిస్ప్లేని 1,080x2,340 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది.ఫ్లిప్కార్ట్ లో ఇది ధర రూ.16,999 తో అమ్మబడుతూ ఉంది.అంటే కాక ఈ ఫోన్ ట్విలైట్ బ్లూ మరియు మూన్‌లైట్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Realme X2

Realme X2

గత సంవత్సరం విడుదల అయిన రియల్ మీ X2 ఫోన్ ధర.రూ.17,999 తో లభిస్తూ ఉంది.ఫ్లిప్కార్ట్ మరియు రియల్ మీ అధికారిక వెబ్సైటు నుండి కొనుగోలు చేయవచ్చు.రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల డిస్ప్లే FHD + (2,340 x 1,080 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో సూపర్ AMOLED ప్యానల్‌తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత 2.2GHz వద్ద అడ్రినో 618 GPU తో క్లాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ రకాల (4GB, 6GB, 8GB) RAM మరియు 64GB, 128GB స్టోరేజ్ లతో వస్తుంది.  

Samsung Galaxy M40

Samsung Galaxy M40

శాంసంగ్ నుండి ఉన్న ఫోన్ల లో Samsung Galaxy M40  ధర రూ.15,999  వద్ద లభిస్తుంది.మూడు కెమెరాలతో, స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ తో మార్కెట్లో లభిస్తుంది.అమెజాన్ ఇండియా మరియు శాంసంగ్ అధికారిక వెబ్సైటు ల లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Poco X2

Poco X2

షియోమీ నుండి విడిపోయిన తరువాత షియోమీ యొక్క సబ్-బ్రాండ్ పోకో సంస్థ విడుదల చేసిన తోలి స్మార్ట్ ఫోన్ ఇది Poco X2. మార్కెట్లో దీని ధర రూ.17,499 గా ఉంది.ఇది నాలుగు కెమెరా ల తో పాటు స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ చిప్ తో లభిస్తుంది.మార్కెట్లో ఈ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Best Smartphones Under Rs 20000 in India 2020 July 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X