Smartphones Under RS20,000 ధర రూ.20,000 సెగ్మెంట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు..స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు.!
స్మార్ట్‌ఫోన్లకు భారత్ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. 4G, 5G నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వచ్చిన అనంతరం అనేక మంది సాధారణ ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారుతున్నారు. ఫలితంగా యూజర్లు ఆకట్టుకొనేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను సంస్థలు లాంచ్ చేస్తున్నాయి.
అయితే ప్రస్తుత మార్కెట్‌లో రూ.20,000 లోపల ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ ధరలో లాంచ్ చేసేందుకు అనేక సంస్థలు పోటీపడుతుంటాయి. అయితే రూ.20వేల లోపు ధర కలిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు వివరాలు మీకోసం. ఈ జాబితాలో రెడ్‌మి, పోకో, లావా, మోటో వంటి సంస్థలు ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 13 5G : ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ (Redmi Note 13 5G) 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 CPU చిప్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OSను కలిగి ఉంటుంది.
ఈ రెడ్‌మి నోట్ 13 5G హ్యాండ్‌సెట్ 108MP +8MP+2MP వెనుక కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Mi.comలో ఈ ఫోన్ ధర రూ.17,999గా ఉంటుంది.

మోటో G84 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Moto G84 5G) 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల పుల్ HD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత MyUX OS ను కలిగి ఉంటుంది. మరియు 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటో G84 ఫోన్ 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను రూ.17,999కు కొనుగోలు చేయవచ్చు.

టెక్నో Camon 20 ప్రో 5G : ఈ స్మార్ట్‌ఫోన్ (Tecno Camon 20 Pro 5G) 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. వెనుకవైపు OIS సపోర్టుతో 64MP కెమెరా + 2MP + 2MP కెమెరాలు మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అమెజాన్ ఈఫోన్‌ను రూ.19,499కు కొనుగోలు చేయవచ్చు.

లావా అగ్ని 2 5G : ఈ లావా స్మార్ట్‌ఫోన్ (Lava Agni 2 5G) 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పైన పనిచేస్తుంది. 66W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుకవైపు 50MP+ 8MP+ 2MP+2MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. అమెజాన్‌లో ఈఫోన్‌ను రూ.17,999కు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications