Home
Mobile

Best Smartphones రూ.25,000 ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. లిస్ట్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ ముందంజలో ఉంటుంది. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్‌ హ్యాండ్‌సెట్‌ల వరకు భారీ స్థాయిలో విక్రయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్‌ ఉంది. రూ.25000 ధరలో ప్రస్తుతం అనేక ఫోన్‌లు (Best Smartphones under RS25000 price) అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో ఐకూ Z9s ప్రో, రియల్‌మి 13 ప్లస్‌ 5G, హానర్‌ X9b, నథింగ్‌ ఫోన్‌ 2a, మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్‌ వివరాలు.

ఐకూ Z9s ప్రో : ఈ స్మార్ట్‌ఫోన్‌ (iQOO Z9s Pro Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2392*1080 పిక్సల్స్ రిజల్యూషన్‌ సహా 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది.

Best Smartphone under RS25000 in november 2024 sale details

ఈ ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వెనుక వైపు 50MP + 8MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభం ధర రూ.24,998 గా ఉంది. ప్రస్తుతం మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

రియల్‌మి 13 ప్లస్ 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ (Realme 13 Plus 5G Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది.

ఈ రియల్‌మి ఫోన్‌ OIS (ఆప్టి్కల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ LYT 600, 2MP పొర్ట్రెయిట్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది.

హానర్‌ X9b 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ (Honor X9b 5G) అల్ట్రా బౌన్స్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల 1.5K కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 35W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.21490 గా ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2a : ఈ స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 2a) 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వరకు జతచేసి ఉంది.

వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.23999 గా ఉంది.

మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో : ఈ స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Neo) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల 1.5K pOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హీలియో UI OS, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. MIL- STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టు, 50MP సోనీ LYT 700C కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరా 10MP టెలిఫోటో కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 68W టర్బో ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సామర్థ్యంతో 4310mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.22999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Best Smartphones under RS25000 in november 2024 in india check list price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X