భారీ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తోన్న బెస్ట్ మొబైల్స్ ఇవే

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ అనేది కీలక విషయం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేముందు ఫోన్ బ్యాటరీ కెపాసిటీ పై నిర్థిష్టమైన అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. శక్తివంతమైన 5000mAh, 4000mAh బ్యాటరీ యూనిట్‌లతో మార్కెట్లో దొరుకుతోన్న 10 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Asus Zenfone 3s Max

Asus జెన్‌ఫోన్ 3ఎస్ మాక్స్
ధర రూ.12,990

ప్రధాన స్పెసిఫికేషన్స్

5000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, 5.2 అంగుళాల స్ర్కీన్, ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయి్డ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Lenovo P2 3GB RAM

లెనోవో పీ2 (3జీబి ర్యామ్)
ధర రూ.13,499

ప్రధాన స్పెసిఫికేషన్స్

5100 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, 5.5 అంగుళాల స్ర్కీన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Celkon Q5K Transformer

సెల్‌కాన్ క్యూ5కే ట్రాన్స్‌ఫార్మర్
ధర రూ.4,990

ప్రధాన స్పెసిఫికేషన్స్

5000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 5.అంగుళాల స్ర్కీన్, క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1 జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Lenovo Vibe P1

లెనోవో వైబ్ పీ1
ధర రూ.12,990

ప్రధాన స్పెసిఫికేషన్స్

5000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ,4జీ సపోర్ట్, 5.5 అంగుళాల స్ర్కీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

 

Panasonic Eluga Ray X

పానాసోనిక్ ఎల్యుగా రే ఎక్స్
ధర రూ.8,999

ప్రధాన స్పెసిఫికేషన్స్

4000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, 5.5 అంగుళాల స్ర్కీన్, క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

 

Xiaomi Redmi Note 4

షియోమి రెడ్‌మి నోట్ 4
ధర రూ.10,999

ప్రధాన స్పెసిఫికేషన్స్

4000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Lenovo K6 Power 4GB RAM

లెనోవో కే6 పవర్ (4జీబి ర్యామ్ వేరియంట్)
ధర రూ.9,990

ప్రధాన స్పెసిఫికేషన్స్

4000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ,4జీ VoLTE సపోర్ట్, 5 అంగుళాల స్ర్కీన్, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 64 బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీనికి విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ఫ్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
ధర రూ.14,690

ప్రధాన స్పెసిఫికేషన్స్

4000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, 5.5 అంగుళాల స్ర్కీన్, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో + నానో/మైక్రోఎస్డీ), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Motorola Moto E4 Plus

మోటరోలా మోటో ఇ4 ప్లస్
ధర రూ.9,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5000 mAh బిల్ట్-ఇన్ బ్యాటరీ, 4జీ VoLTE సపోర్ట్, 5.5 అంగుళాల స్ర్కీన్, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్,32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best smartphones with 5000 mAh and 4000 mAh battery capacity under Rs 15,000. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot