Home
Mobile

రూ.8000 కంటే తక్కువ ధరలో 50MP కెమెరాను కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ (Flipkart Big Saving Day Sale 2025) ప్రారంభం అయింది. ఈ సేల్‌ మార్చి 13 వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక కేటగిరీల ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీ, ఇయర్‌బడ్స్‌, ట్యాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌, AC, కూలర్‌ సహా ఇతర గృహోపకరణాలను సొంతం చేసుకోవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు పాత వస్తువులు ఎక్స్చేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

Best Smartphones with 50MP Primary Camera under Rs8000

ఈ సేల్‌లో భాగంగా రూ.8000 కంటే తక్కువ ధరలో 50MP ప్రైమరీ కెమెరా కలిగిన (Smartphones with 50MP Primary Camera under Rs8000) స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఈ సంవత్సరం లాంచ్‌ అయిన ఫోన్‌ల నుంచి గత ఏడాది విడుదల అయిన హ్యాండ్‌సెట్‌లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఫోన్‌ల పూర్తి వివరాలు.

మోటో G05 స్మార్ట్‌ఫోన్‌ :
మోటో G05 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.6,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 3 రక్షణ పొందుతుంది.

మీడియాటెక్‌ హీలియో G81 Extreme SoC ప్రాసెసర్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI (స్కిన్‌ ఆన్‌ టాప్‌) OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 18W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. క్వాడ్‌ పిక్సల్‌ టెక్నాలజీతో కూడిన 50MP ప్రైమరీ, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ప్లమ్‌ రెడ్‌ పారెస్ట్ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్ లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,249 గా ఉంది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నా.. ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 OS తో పనిచేస్తోంది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP + 2MP కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

పోకో C75 5G :
వీటితోపాటు పోకో C75 5G హ్యాండ్‌సెట్ భారీ డిస్‌ప్లేతోపాటు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 18W ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తుంది. కెమెరా పరంగా ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరాతోపాటు మరో లెన్స్‌ను కలిగి ఉంది. వీటితోపాటు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Best Smartphones with 50MP Primary Camera under Rs8000 during flipkart big saving day sale 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X