బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? కొంచెం వెయిట్ చేయండి!!!

|

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ యొక్క మార్కెట్ రోజురోజుకీ పోటీగా మారుతున్నది. ప్రస్తుత కాలంలో అన్ని స్మార్ట్‌ఫోన్‌ల సంస్థలు ఒకరికి పోటీగా మరొక దానిని విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న వాటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇది అని చెప్పేలోపే దానికి పోటీగా మరొక స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ లోకి లాంచ్ అవుతున్నది.

5G స్మార్ట్‌ఫోన్‌
 

5G స్మార్ట్‌ఫోన్‌

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల యొక్క పోటీ ఏ స్థాయికి చేరుకున్నదంటే మన దేశంలో 5G ఇంకా ప్రారంభం కాకముందే రియల్ మీ, ఐకూ వంటి సంస్థలు తమ 5G స్మార్ట్‌ఫోన్‌లను ఏకంగా లాంచ్ చేశాయి కూడా. ఒకప్పుడు బడ్జెట్ రంగానికే పరిమితమైన పోటీ క్రమంగా అన్ని విభాగాలకూ కూడా విస్తరించింది. అంతేకాకుండా ప్రతి హ్యాండ్‌సెట్‌ లోనూ కొత్త కొత్త టెక్నాలజీని పొందుపరుస్తున్నయి.

Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌

స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తున్న ఫీచర్లు కూడా వినియోగదారుల యొక్క అంచనాలను తారాస్థాయికి తీసుకుపోతున్నాయి. దీంతో కొత్త ఫోన్లను కొనాలనుకునే వారు మరింత గందరగోళానికి లోనవడం సహజం. ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు తోడు మార్చిలో కూడా కొన్ని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వీటిలో 5జీ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఒప్పో, ఇన్ఫినిక్స్, వన్‌ప్లస్, శామ్‌సంగ్, హువాయి వంటి బ్రాండ్లు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లు

​1. నోకియా 10 (5జీ)

​1. నోకియా 10 (5జీ)

నోకియా తన నోకియా 10 (5జీ) స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో కచ్చితంగా తెలపనప్పటికీ ఇది మార్చిలో రానుందని మాత్రం లీకుల ద్వారా తెలిసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5జీ నెట్ వర్క్ కూడా ఉంది. ఇందులో వెనకవైపు 16 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను వెనకవైపు అందించారు. ముందువైపు 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రత్యర్థులకు చెమటలు

2. రియల్ మీ 6/రియల్ మీ 6 ప్రో
 

2. రియల్ మీ 6/రియల్ మీ 6 ప్రో

రియల్ మి సంస్థ తన రియల్ మీ 6, రియల్ మీ 6 ప్రో స్మార్ట్ ఫోన్లను మార్చి 5వ తేదీన అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది 64 మెగాపిక్సెల్స్ కెమరాతో కూడిన క్వాడ్ కెమరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది 20x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ తో రానున్నట్లు సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఇది 90HZ ఫుల్ HD+ డిస్ ప్లే, 30W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ ఫీచర్లను కలిగి ఉన్నట్లు ప్రకటించింది.

Vivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీ

​3. ఇన్ఫినిక్స్ S5 ప్రో

​3. ఇన్ఫినిక్స్ S5 ప్రో

ఇన్ఫినిక్స్ సంస్థ కొత్త ఇన్ఫినిక్స్ S5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మార్చి 6వ తేదీన లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అధికారికంగా దీన్ని లాంచ్ చేయడానికి ముందుగానే ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీకైన ఫోటోల ప్రకారం చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ నాచ్ లెస్ డిస్ ప్లేతో పాపప్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది వెనకవైపున ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉండి 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మరియు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నట్లు తెలుస్తుంది.

YouTube వీడియోలను రిపీట్ మోడ్(లూప్‌) లో ప్లే చేయడం ఎలా?

​4. వన్‌ప్లస్ 8 ప్రో

​4. వన్‌ప్లస్ 8 ప్రో

ఈ మార్చిలో అధిక అంచనాలతో రాబోతున్న ఫోన్లలో వన్‌ప్లస్ సంస్థ యొక్క కొత్త స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 8 ప్రో కూడా ఒకటి. లీక్ అయిన సమాచారం ప్రకారం ఇది 6.65 అంగుళాల డిస్ ప్లేతో లాంచ్ కాబోతుందని తెలుస్తోంది. ఇది స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 5జీని సపోర్ట్ తో వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

​5. ఒప్పో రెనో 3, రెనో 3 ప్రో

​5. ఒప్పో రెనో 3, రెనో 3 ప్రో

ఒప్పో తన రెనో 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను చైనాలో గతేడాది డిసెంబర్‌లోనే లాంచ్ చేసింది. ఇప్పుడు మార్చి 2వ తేదీన ఇవి భారతదేశంలో కూడా లాంచ్ కానున్నాయి. రెనో 3, రెనో 3 ప్రో, వాటి ప్రధానమైన ఫీచర్ల గురించి చెప్పాలంటే భాగంగా వాటి డిజైన్, డిస్ ప్లే అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వాటి పాపప్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. ఈ ఒప్పో రెనో 3 ప్రోలో వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ఒప్పో రెనో 3 ప్రోలోని ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Best Upcoming Smartphones in March 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X