మే నెలలో అదిరే ఫీచర్లతో రానున్న కూల్ స్మార్ట్‌ఫోన్లు,సెలక్షన్ మీదే

మే నెలలో బెస్ట్ ఫీచర్లతో రానున్న స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాలనుందా ?అయితే మీకోసం లిస్ట్ ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి

|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అది లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేగం పుంజుకున్నప్పటి నుంచి వీటి విపరీతం చాలా బాగా పెరిగిపోయింది. అదీ కాక టెలికాం దిగ్గజాలు డేటా ఆఫర్లను అత్యంత తక్కువ ధరలకే అందించడం కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు.

 
Upcoming Smartphones in May 2018

అయితే మార్కెట్లో రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎక్కువ కాలం నిలవడం లేదు. దీనికి కారణం కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్ మూలకు పడేయడం. ఈ నేపధ్యంలో అలాంటి వారి కోసం ఈ నెలలో బెస్ట్ ఫీచర్లతో రాబోతున్న కొన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లను ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఆకట్టుకునే ఫీచర్లతో Coolpad Note 6,బడ్జెట్ ధరలో..ఆకట్టుకునే ఫీచర్లతో Coolpad Note 6,బడ్జెట్ ధరలో..

LG g7 thinq ( ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ )

LG g7 thinq ( ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ )

ఈ ఫోన్ ఈ నెలలో దక్షిణ కొరియా మార్కెట్లో ముందుగా లాంచ్ అయి ఆ తరువాత ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్లాటినం గ్రే, అరోరా బ్లాక్, మొరాకన్ బ్లూ, రాస్ప్‌బెర్రీ రోజ్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర వివరాలను LG కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ స్పెషిఫికేషన్స్
6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్, గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్‌.

Vivo x21 ( వివో ఎక్స్21 )
 

Vivo x21 ( వివో ఎక్స్21 )

ఈ నెలలోనే ఇది విడుదల కానుంది. అంచనా ధర రూ. రూ.39,900
వివో ఎక్స్21 స్పెషిఫికేషన్స్
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Oneplus 6 ( వన్‌ప్లస్ 6 )

Oneplus 6 ( వన్‌ప్లస్ 6 )

ఉత్కంఠ రేపుతున్న ఈ ఫోన్ కూడా ఈ నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన చైనాతోపాటు ఒకేసారి భారత్‌లోనూ విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫీచర్లు రిలీజ్ కానప్పటికీ కొన్ని లీకయ్యాయి. ధర వివరాలు ఇంకా తెలియలేదు.
వన్‌ప్లస్ 6 స్పెషిఫికేషన్స్ ( అంచనా )
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy a6, Galaxy a6 plus ( శాంసంగ్ గెలాక్సీ ఎ6,  గెలాక్సీ ఎ6 ప్లస్)

Samsung Galaxy a6, Galaxy a6 plus ( శాంసంగ్ గెలాక్సీ ఎ6, గెలాక్సీ ఎ6 ప్లస్)

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ6,గెలాక్సీ ఎ6 ప్లస్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే వీటి ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఎ6 ప్లస్ స్పెషిఫికేషన్స్
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.
శాంసంగ్ గెలాక్సీ ఎ6 స్పెషిఫికేషన్స్
5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor-10 ( హానర్ 10 )

Honor-10 ( హానర్ 10 )

ఈ నెలలో విడుదలయ్యే అవకాశం. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.27,230, రూ.31,420. ( అంచనా )
హానర్ 10 స్పెషిఫికేషన్స్
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Sony Xperia xz2 premium ( సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ప్రీమియం )

Sony Xperia xz2 premium ( సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ప్రీమియం )

ఈ నెలలో విడుదలయ్యే అవకాశం, ధర వివరాలపై ఎటువంటి సమాచారం లేదు.
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2 ప్రీమియంస్పెషిఫికేషన్స్
5.8 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 3840 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 19, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3540 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Nubia red magic gaming phone ( నూబియా రెడ్ మ్యాజిక్ )

Nubia red magic gaming phone ( నూబియా రెడ్ మ్యాజిక్ )

6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో లభ్యమయ్యే అవకాశం. ధరలు రూ.26,190, రూ.31,430 ( అంచనా )
నూబియా రెడ్ మ్యాజిక్ స్పెషిఫికేషన్స్
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 24 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆటోమేటిక్ కూలింగ్ సిస్టమ్‌.

Blackberry athena ( బ్లాక్‌బెర్రీ అథెనా )

Blackberry athena ( బ్లాక్‌బెర్రీ అథెనా )

ధర , లాంచింగ్ తేదీ వివరాలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
బ్లాక్‌బెర్రీ అథెనా స్పెషిఫికేషన్స్
4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Moto z3 play ( మోటో జడ్3 ప్లే )

Moto z3 play ( మోటో జడ్3 ప్లే )

ధర , లాంచింగ్ తేదీ వివరాలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
మోటో జడ్3 ప్లే స్పెషిఫికేషన్స్
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

Nokia X  ( నోకియా ఎక్స్‌ )

Nokia X ( నోకియా ఎక్స్‌ )

మే 16వ తేదీన విడుదల ఫోన్ గురించి పూర్తి స్పెషిఫికేషన్లను, ధరను ఇంకా వెల్లడించలేదు.
నోకియా ఎక్స్‌ స్పెషిఫికేషన్స్ ( అంచనా )
5.8 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, వెనుక భాగంలో రెండు కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , ఐఫోన్ 10 నాచ్ డిస్‌ప్లే,

Nokia X6 ( నోకియా ఎక్స్ 6 ) గత నెలలో రిలీజయింది.
4/6 జీబీ ర్యామ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.16,839, రూ.18,946.
నోకియా ఎక్స్6 ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Best Mobiles in India

English summary
Upcoming Mobiles May 2018 - Find the list of all upcoming mobile phones in may 2018 with expected launch dates, expected prices, specifications at Telugu Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X