ఇండియాకి త్వరలో రానున్న టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఇండియన్ మొబైల్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచదేశాల్లో ఉన్న మొబైల్ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారింది.

By Hazarath
|

ఇండియన్ మొబైల్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచదేశాల్లో ఉన్న మొబైల్ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారింది. టాప్ కంపెనీలన్నీ తమ ఫోన్లను లాంచ్ ఇండియా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. చైనా, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ లోని మొబైల్ తయారీ సంస్థలన్నీ తమ డివైస్ లను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ మార్కెట్ చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు త్వరలో ఇండియాకి ఏ కంపెనీ మొబైల్స్ రాబోతున్నాయనే అనే దానిపై ఓ లుక్కేద్దాం.

 

షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !

మిజు ఎం6ఎస్

మిజు ఎం6ఎస్

మిజు తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎం6ఎస్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. రూ.9,925 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హెగ్జాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఎల్‌జీ ఎక్స్4 ప్లస్
 

ఎల్‌జీ ఎక్స్4 ప్లస్

ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్4 ప్లస్‌'ను కొరియా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలోనే ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.17,980గా ఉండే అవకాశం ఉంది.
ఎల్‌జీ ఎక్స్4 ప్లస్ ఫీచర్లు
5.3 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎల్‌జీ పే, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హెచ్‌టీసీ యూ11 ఐస్

హెచ్‌టీసీ యూ11 ఐస్

హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'యూ11 ఐస్‌'ను తైవాన్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. ఇండియాలో దీని ధర రూ.32,020 ఉంటుందని అంచనా.
హెచ్‌టీసీ యూ11 ఐస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

టెక్నో కామన్ ఐ

టెక్నో కామన్ ఐ

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు టెక్నో మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'టెక్నో కామన్ ఐ' ని తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ.8,999 అంచనా.ఇండియాకి త్వరలో వచ్చే అవకాశం ఉంది,
ఫీచర్లు
5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె8 2018

శాంసంగ్ గెలాక్సీ జె8 2018

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె8 2018ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నారు.

అల్కాటెల్ 3వీ

అల్కాటెల్ 3వీ

అల్కాటెల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అల్కాటెల్ 3వీ'ని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.
ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో ఎక్స్20 ప్లస్ యూడీ

వివో ఎక్స్20 ప్లస్ యూడీ

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వివో ఎక్స్20 ప్లస్ యూడీ'ని త్వరలో విడుదల చేయనుంది. రూ.36,770 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. కాగా ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఈ ఫోన్ గుర్తింపు పొందనుంది.
వివో ఎక్స్20 ప్లస్ యూడీ ఫీచర్లు
6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3905 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 9

నోకియా 9

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రదర్శనలో నోకియా 9 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8, 12 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు ఉండవచ్చని సమాచారం. అయితే దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Top smartphones coming soon to the Indian market More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X