మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

|

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సరితూగే వెబ్ బ్రౌజర్ కోసం వెదుకుతున్నారా..? ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న ఈ వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న టాప్-5 బెస్ట్ వెబ్ బ్రౌజర్‌ల వివరాలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందకు ఎన్ని రకాల బ్రౌజర్లు ఎదురుచూస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లు విడుదలవుతూనే వుంటాయి. మొట్టమొదటి వెబ్‌ బ్రౌజర్‌ను 1990లో టిమ్‌ బెర్నర్స్‌లీ వరల్డ్‌వైడ్‌వెబ్‌ పేరుతో రూపొందించాడు. ఆ తర్వాత అది 'నెక్సస్‌'గా మారింది. 1993లో 'మొజాయిక్‌' (ఆ తర్వాత నెట్‌స్కేప్‌గా మారింది), 1994లో నెట్‌స్కేప్‌ నేవిగేటర్‌, 1995లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వంటి బ్రౌజర్లు నెట్‌ బ్రౌజింగ్‌ను సులభతరం చేసుకుంటూ వచ్చాయి.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

1.) ఒపెరా మినీ వెబ్ బ్రౌజర్ ( Opera Mini Web Browser):

వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ఈ బ్రౌజర్ చేరువచేస్తుంది. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ వెబ్ బ్రౌజర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వెబ్ పేజీలు వేగవంతంగా లోడ్ అవుతాయి. దింతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంటర్నెట్ డేటాను వినియోగించవచ్చు. ప్రత్యేకతలు: పించ్-టూ-జూమ్ ఇంకా స్మూత్ పానింగ్, బుక్ మార్క్స్ సింక్రనైజ్, స్పీడ్ డయిల్, ట్విట్టర్ ఇంకా

ఫేస్‌బుక్ సపోర్ట్, గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉచిత అప్లికేషన్ వయా ఒపెరా మినీ బ్రౌజర్. లింక్ అడ్రస్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

2.) స్కై ఫైర్ వెబ్ బ్రౌజర్ 4.0(Skyfire Web Browser 4.0):
ఈ కూల్ వెబ్ బ్రౌజర్ ఉన్నత విలువలతో కూడిన స్మార్ట్ వెబ్ బ్రౌజింగ్‌ను చేరువచేస్తుంది. ఉత్తమ సోషల్ మొబైల్ బ్రౌజర్‌గా స్కై ఫైర్ వెబ్ బ్రౌజర్ గుర్తింపు తెచ్చుకోవటం విశేషం.
ప్రత్యేకతలు: ఫ్లాస్ వీడియో సపోర్ట్, యూజర్ అర్జెంట్ స్విచింగ్, ఫేస్‌బుక్ క్విక్ వ్యూ, స్కై ఫైర్ వన్ టచ్ సెర్చ్. డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’
 
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

3.) డాల్ఫిన్ బ్రౌజర్ హైడెఫినిషన్ (Dolphin Browser HD):

యూజర్ ఫ్రెండ్లీ ఇంకా వేగవంతమైన మొబైల్ వెబ్ బ్రౌజర్‌లా డాల్ఫిన్ వెబ్ బ్రౌజర్ మొదటి స్థానంలో ఉంటుంది. గెస్ట్యుర్, వెబ్ జైన్, యాడ్-ఆన్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ బ్రౌజర్‌లో ఉన్నాయి. ప్రత్యేకతలు: బాక్స్ ఫర్ డాల్ఫిన్, డాల్ఫిన్ డాట్ కామ్, డాల్ఫిన్ క్యూఆర్ కోడ్ షేర్, బుక్‌మార్క్ టూ ఎస్డీ, డాల్ఫిన్ యూట్యూబ్ సెర్చ్, డాల్ఫిన్ వికీపీడియా సెర్చ్, డాల్ఫిన్ ఈబే సెర్చ్, డాల్పిన్ అలెక్సా ర్యాంక్. డౌన్‌లోడ్ లింక్:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

4.) ఎక్స్‌స్కోప్ బ్రౌజర్ (xScope Browser):వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌ను కోరుకునే వారికి ఎక్స్ స్కోప్ బ్రౌజర్ ఉత్తమ ఆప్షన్. మల్టీ టచ్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. ఈ బ్రౌజర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ప్రత్యేకతలు: మన్నికైన పనితీరు, అనేకమైన సెట్టింగ్స్ ఇంకా ఆప్షన్స్, ఇంపోర్ట్ గూగుల్ బుక్‌మార్క్స్, ఇంపోర్ట్ డెస్క్‌టాప్ బుక్‌మార్క్స్, ఇంటిగ్రేటెడ్ ఫైల్ ఎక్ప్‌ప్లోరర్, బ్రౌజ్, ఈ-మెయిల్ ఇంకా జిప్.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ‘బెస్ట్ వెబ్ బ్రౌజర్‌లు’

5.) యూసీ బ్రౌజర్ (UC Browser):

అనేక షార్ట్‌కట్ ఫీచర్లు ఈ బ్రౌజర్‌లో ఉన్నాయి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ వెబ్ బ్రౌజర్‌ను ఇన్స్ స్టాల్ చేసుకోవటం ద్వారా వెబ్ పేజీలు వేగవంతంగా లోడ్ అవుతాయి. దింతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంటర్నెట్ డేటాను వినియోగించవచ్చు. లింక్ అడ్రస్:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X