ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు ‘వైరస్ అలర్ట్’

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఓ భయానక వైరస్ కలవరపెడుతోంది. ఈ వైరస్ పేరు ‘ఓబ్యాడ్.ఏ ట్రాజాన్' (Obad.a Trojan). ఎస్ఎంఎస్ రూపంలో ఫోన్‌లలోకి చొరబడుతున్న ఈ హానికర వైరస్ ఫోన్ డేటాను నాశనం చేస్తున్నట్లు క్యాస్పర్‌స్కై ల్యాబ్స్ గుర్తించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు ‘వైరస్ అలర్ట్’

ఈ హానికర వైరస్ సాధారణ ఎస్ఎంఎస్‌ల రూపంలో ఫోన్‌కు చేరుతోంది. సదరు మొబైల్ యూజర్ ట్రాజాన్ మాల్వేర్‌తో కూడిన ఈ హానికర సందేశాన్ని ఓపెన్ చేసిన వెంటనే సందేశాన్ని మరొక్కసారి రీలోడ్ చేయమని కోరుతుంది. ఆ లింక్ పై మరొక్కసారి క్లిక్ చేసిన వెంటనే డివైజ్‌లోకి వైరస్ డౌన్‌లోడై మొత్తం ఫోన్ వ్యవస్థను తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది.

ఈ భయానక వైరస్ సదరు ఫోన్ యజమాని ప్రమేయం లేకుండానే ఫోన్‌లోని కాంటాక్స్ జాబితాలోకి ప్రవేశించి అన్ని కాంటాక్ట్‌లకు ఇదే తరహా వైరస్ ఎస్ఎంఎస్‌లను పంపిస్తుంది. ప్రస్తుతానికిఈ వైరస్ రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ ఇంకా కజాకిస్తాన్ ప్రాంతాలకు విస్తరించినట్లు తెలస్తోంది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం లేకపోలేదుని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గుర్తుతెలియని నెంబరు నుంచి వచ్చిన ఎస్ఎంఎస్‌లను తెరిచే విషయంలో అప్రమత్తత వహించండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot