వరస నష్టాల్లో ఎయిర్‌టెల్‌..?

Posted By: Staff

వరస నష్టాల్లో ఎయిర్‌టెల్‌..?

 

న్యూఢిల్లీ: వరుసగా గత ఎనిమిది త్రైమాసికాల నుంచి ఎయిర్‌టెల్‌ నష్టాలను చవిచూస్తోంది. డిసెంబర్‌తో ముగిసిన  మూడవ క్వార్టర్‌తో  ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికరలాభం రూ.1,011 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,303 కోట్లు ఆదాయాన్ని నమోదు చేసింది. 3జీ సేవల కోసం తీసుకున్న పెట్టుబడులపై పెద్ద ఎత్తున వడ్డీలు చెల్లించడంతో కంపెనీ నష్టాల పాలైందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్‌ 3జీ సేవలను ప్రారంభించినందు వల్ల రూ.164 కోట్లు అసలు, వడ్డీ కలిపి చెల్లించింది. ఈ మూడవ క్వార్డర్ లో నికరంగా వడ్డీలే రూ.116 కోట్లకు చేరాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot