మీరు ఎయిర్‌టెల్ కస్టమరా..?

Posted By:

మీరు ఎయిర్‌టెల్ కస్టమరా..?

 

హైదరాబాద్: మీరు ఎయిర్ టెల్ కస్టమరా..?, అయితే ఓ శుభవార్త!!, మీ సఖ్యతకు మరింత భరోసాను కల్పిస్తూ ఎయిర్‌టెల్ మనీ పేరుతో దేశవ్యాప్తంగా నగదు చెల్లింపు, బదిలీ పథకాన్ని భారతి ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ ఎం కామర్స్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ఎయిర్ టెల్  వినియోగదారులు తమ మొబైల్ ద్వారా బిల్లుల చెల్లింపు, రీచార్జీ, షాపింగ్ సహా నగదు బదిలీ చేపట్టవచ్చు. దేశవ్యాప్తంగా 300 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది. భారత్‌లో మొబైల్ ఆధారిత ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులను అందించటం మొదటిసారని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఢిల్లీ, చెన్నై సర్కిళ్లలో ఎయిర్‌టెల్ మనీ సర్వీసులను ప్రారంభించామని, ప్రస్తుతం దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎయిర్‌టెల్ సిఇఒ సంజయ్ కపూర్ తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot