బిగ్ ‘సి’ ఉగాది ఆఫర్లు

Posted By:

ఉగాది పండుగను పురస్కరించుకని ప్రముఖ మొబైల్ విక్రయాల చెయిన్ బిగ్ ‘సి' మొబైల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లలో భాగంగా ఎంపిక చేయబడిన మొబైల్స్ పై ‘క్యాష్ బ్యాక్', సెలక్ట్ చేయబడిన పలు మొబైల్ ఫోన్‌ల పై మరో మొబైల్ ఫోన్ ఉచితంగా పొందే అవకాశం, కొన్ని మోడల్స్ పై ధర తగ్గింపు ఆఫర్ చేస్తున్నట్లు బిగ్ ‘సి' మొబైల్ చైర్మన్ ఎం.బాలు చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు.

బిగ్ ‘సి’ ఉగాది ఆఫర్లు

సామ్‌సంగ్ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 కొనుగోలు పై రూ.7,000 తగ్గింపును, సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కొనుగోలు పై రూ.4,000 రాయితీని అందిస్తున్నట్లు ఈ సందర్భంగా బాలు చౌదరి పేర్కొన్నారు. అలానే మైక్రోమాక్స్ కాన్వాస్ 4 పై 35 శాతం, నోకియా లూమియా 625 పై 25 శాతం క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఆయన వెల్లిడించారు.

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై మరో డ్యుయల్ సిమ్ కెమెరా కలిగిన మొబైల్‌ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి స్మార్ట్‌ఫోన్ పైనా ఏడాది పాటు అదనందా జాతీయ స్థాయివారంటీ ఉంటుందని ఫలితంగా రెండేళ్ల వారంటీ లభిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్‌లలో ఈ ఆఫర్లు వారం రోజులు పాటు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot