ఐఫోన్ 8 దెబ్బ : భారీగా దిగొచ్చిన ఐఫోన్ల ధరలు

Written By:

సెప్టెంబర్ 12న ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం జరగనున్న నేపథ్యంలో ఐఫోన్ల ధరలు దిగొచ్చాయి. అదెలా అనుకుంటున్నారా..ఆ ఈవెంట్ లో ఐఫోన్ 8 లాంచ్ కాబోతోంది. ఐఫోన్ 8తో పాటు ఐఫోన్‌ 7ఎస్‌, ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతుందనే వార్తల నేపథ్యంలో పాత ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను పేటీఎం మాల్ ప్రకటించింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 6 తో పాటు మిగతా మోడల్స్‌పై పేటీఎం మాల్‌ ఈ భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. పరిమిత కాల వ్యవధిలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. తగ్గింపు పొందిన ఫోన్ల వివరాలు..

సరికొత్తగా ఐఫోన్ 8 ఈవెంట్, ఆహ్వానిస్తున్న ఆపిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌ 7 ఆఫర్‌

ఐఫోన్‌ 7ను అతి తక్కువగా డిస్కౌంట్‌ ధరలో రూ.39,479కే విక్రయం
65,200 రూపాయల ధర కలిగిన ఐఫోన్‌ 7 128జీబీ వేరియంట్‌పై కూడా 8 శాతం డిస్కౌంట్‌, రూ.12వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌
56,200 రూపాయల ధర కలిగిన ఐఫోన్‌ 7 32జీబీ రోజ్‌ గోల్డ్‌ వేరియంట్‌ పై 13 శాతం డిస్కౌంట్‌, రూ. 9,100 క్యాష్‌బ్యాక్‌, ధర రూ. 39,599
80వేల రూపాయల ధర కలిగిన ఐఫోన్‌ 7 256జీబీ రోజ్‌ గోల్డ్‌ వేరియంట్‌పై 24 శాతం డిస్కౌంట్‌, 10,500 క్యాష్‌బ్యాక్‌, ధర రూ. 60,898
ఐఫోన్‌ 7 256జీబీ బ్లాక్‌ వేరియంట్‌ కూడా డిస్కౌంట్‌ ధరలో రూ.62,099కు అందుబాటులో ఉంది.

ఐఫోన్‌ 6 ఆఫర్‌

ఐఫోన్‌ 6ను 21,685 రూపాయలకు పేటీఎం మాల్‌ అందిస్తోంది. ఈ ఫోన్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ ధర 27,685 రూపాయలకు అందుబాటులో ఉండగా.. దీనిపై 6000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్‌ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.21,685కు దిగొచ్చింది.

ఐఫోన్‌ 7 ప్లస్‌ 32జీబీ-గోల్డ్‌ వేరియంట్‌

ఐఫోన్‌ 7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా డిస్కౌంట్‌ ధరలో అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్‌ 7 ప్లస్‌ 32జీబీ-గోల్డ్‌ వేరియంట్‌ అసలు ధర 72వేల రూపాయలుండగా.. డిస్కౌంట్‌ అనంతరం 51,399 రూపాయలకే ఈ ఫోన్‌ విక్రయానికి వచ్చింది.

సిల్వర్‌ కలర్‌

ఇదే వేరియంట్‌ సిల్వర్‌ కలర్‌ ఫోన్‌ కూడా 51,370 రూపాయలకే అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్‌ 7 ప్లస్‌ 128జీబీ(గోల్డ్‌) వేరియంట్‌ను పేటీఎం మాల్‌ 57,599 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ మోడల్‌ అసలు ధర 82వేల రూపాయలు.

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కూడా డిస్కౌంట్‌ ధరలో 37,299 రూపాయలకు పేటీఎం మాల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ అసలు ధర 72వేల రూపాయలు.

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 16జీబీ(గోల్డ్‌) వేరియంట్‌

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ 16జీబీ(గోల్డ్‌) వేరియంట్‌ కూడా 38,299 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మోడల్‌ అసలు ధర కూడా 72వేల రూపాయలు.

ఐఫోన్ ఎస్ఈ

2జిబి ర్యామ్ 16 జిబి స్టోరేజ్ ధర రూ. 39000
డిస్కౌంట్ 42 శాతం, క్యాష్ బ్యాక్ రూ. 2200
ఇప్పుడు రూ. 20 వేలకే సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 6 sells for Rs 21,700, iPhone 7 for Rs 39,500 as iPhones get big discounts before iPhone 8 launch Read More At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot