Home
Mobile

ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఐఫోన్ 16e రాకతో ఈ 3 ఐఫోన్లు మార్కెట్ నుంచి ఔట్!

iPhone 16e Launch: ఐఫోన్ 16e లాంచ్ అయిన వెంటనే యాపిల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా మూడు ఐఫోన్ మోడళ్లను తన ఆన్‌లైన్ స్టోర్ నుంచి తీసేసింది. ఐఫోన్ SE (2022), ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ మోడళ్లను యాపిల్ అమ్మదు. SE, 14 ప్లస్ మోడల్స్ యాపిల్ స్టోర్‌లో కనిపించవు కానీ, ఐఫోన్ 14 ఇతర రీటైలర్ల దగ్గర లభిస్తుంది. తక్కువ ధరలో ఐఫోన్ కావాలనుకునే వారు దీన్ని చెక్ చేయవచ్చు.

* ఐఫోన్ SE (2022) ఇక చరిత్ర

చిన్న సైజులో, టచ్ ఐడీతో వచ్చిన ఐఫోన్ SE (2022) మోడల్‌కు యాపిల్ గుడ్‌బై చెప్పేసింది. ఒకప్పుడు చిన్న ఫోన్లు కావాలనుకునేవారికి, తక్కువ ధరలో ఐఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. కానీ, ఇప్పుడు ఇది కాస్త పాత మోడల్ అయిపోయింది. అందుకే దీన్ని తీసేసి, దీని ప్లేస్‌లో ఐఫోన్ 16e ని తీసుకొచ్చింది యాపిల్.

Big Shock for Apple Users  These 3 iPhones Discontinued After iPhone 16e Launch

తక్కువ ధరలో ఐఫోన్ కావాలనుకునేవారికి 16e బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. SEతో పోలిస్తే, 16eలో సూపర్ OLED డిస్‌ప్లే, పవర్ఫుల్ A18 చిప్, లేటెస్ట్ డిజైన్ ఉన్నాయి. హోమ్ బటన్ ఫోన్లకు స్వస్తి చెప్పి, ఫుల్ స్క్రీన్ మోడళ్లకు మారాలని ఆపిల్ చూస్తోందని ఈ నిర్ణయం చూస్తే అర్థమవుతోంది.

* ఐఫోన్ 14 ప్లస్‌కు నో డిమాండ్

ఐఫోన్ 14 ప్లస్‌ను కూడా యాపిల్ అమ్మడం ఆపేసింది. నిజానికి చాలామంది ఇలా జరుగుతుందని ముందే ఊహించారు. ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచే అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలామంది కస్టమర్లు నార్మల్ ఐఫోన్ 14 లేదా ప్రో మోడల్స్‌కే ఓటు వేశారు. దీంతో 14 ప్లస్ మాత్రం ఎవరికీ పెద్దగా నచ్చలేదు.

ఇప్పుడు కొత్త ఐఫోన్లు వచ్చేయడంతో, 14 ప్లస్‌ను పూర్తిగా తీసేయాలని యాపిల్ డిసైడ్ చేసింది. అయితే ఈ మొబైల్ కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ న్యూస్ చెప్పవచ్చు. ఈ ప్లస్ వేరియంట్‌ ఫోన్ పెద్ద బ్యాటరీ, పెద్ద స్క్రీన్‌తో తక్కువ ధరలోని లభిస్తుంది. దీనిలోని ప్రాసెసర్ కూడా పవర్‌ఫుల్.

* ఐఫోన్ 14 అందుబాటులో ఉంటుంది కానీ

ఐఫోన్ 14 యాపిల్ స్టోర్ నుంచి మాయమైనా, టెన్షన్ పడక్కర్లేదు. ఇది ఇంకా ఆథరైజ్డ్ రీసెల్లర్ల దగ్గర అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఫీచర్లు వద్దు కానీ, తక్కువ ధరలో ఐఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నిజానికి ఇప్పుడు దీనిపై భారీ డిస్కౌంట్లూ ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఐఫోన్ కొనాలనుకునేవారికి ఐఫోన్ 14 బెస్ట్ ఛాయిస్.

కొత్త మోడళ్లను హైలైట్ చేయడానికే ఈ ప్లాన్..?

ఈ మోడళ్లను యాపిల్ ఆపేయడానికి కారణం ఏంటంటే.. తన ప్రొడక్ట్ లైనప్‌ను సింపుల్‌గా ఉంచాలని, కొత్త డివైజ్‌లను ఎక్కువగా ఫోకస్ చేయాలని చూస్తోంది. కస్టమర్లు ఎప్పుడూ లేటెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ డిజైన్, టాప్ ఫీచర్స్‌తో ఉన్న ఫోన్లనే వాడాలని యాపిల్ కోరుకుంటోంది. అందుకే ఇలా పాత మోడళ్లను తీసేసి, కొత్త వాటిని ప్రమోట్ చేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple discontinued iPhone SE and 14 Plus after iPhone 16e launch. iPhone 14 remains at resellers. This streamlines product line, promoting newer models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X