బిగ్‌సీలో మొబైల్ కొన్నారు.. కార్లు గెలచుకున్నారు!!

Posted By: Prashanth

బిగ్‌సీలో మొబైల్ కొన్నారు.. కార్లు గెలచుకున్నారు!!

 

‘మొబైల్ కొనండి, 5 కార్లు గెల్చుకోండి’ ఆఫర్ విజేతలకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేశామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 27 వరకూ కొనసాగిన ఈ ఆఫర్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్ ఎం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్‌లో విజేతలైన ఐదుగురికి 5 కార్లను అందజేసి, అభినందనలు తెలిపారు. తామందించిన ఆఫర్లన్నీ విజయవంతమయ్యాయని, దీంతో మరిన్ని ఆఫర్లనందించేందుకు తమకు ప్రోత్సాహం లభించిందని చౌదరి వివరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot