నోకియా బంగారు పూత ఫోన్: నోకియా ఓరొ

Posted By: Staff

నోకియా బంగారు పూత ఫోన్: నోకియా ఓరొ

ఇండియాలో ఐటి సెక్టార్ వచ్చిన తర్వాత లగ్జరీ, డిజైనర్ ఐటమ్స్‌కి మంచి గిరాకీ వచ్చింది. అన్నిరంగాల ప్రజలు మంచి ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, డిజైనర్ ఐటమ్స్‌ని కొనుగోలు చేయడానికి చాలా ఉత్సాహాం చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు మొబైల్స్ వైపుకి చేరింది. మొబైల్ తయారీ సంస్దలు కస్టమర్స్ అభిరుచికి తగ్గట్లు మొబైల్స్‌ని రూపోందించడం చేస్తున్నారు. మంచి ఉత్పత్తులను మనసుకి నచ్చిన వాటిని కస్టమర్స్ అసలు ఆలోచించకుండా కోనుగోలు చేస్తున్నారు.

ఖరీదైన రెండు మొబైల్స్ గురించి ఈరోజు చర్చిద్దాం. ఆ రెండు మొబైల్స్‌లలో ఒకటి నోకియా ఓరో, రెండవది సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా రే. రెండు మొబైల్స్ కూడా హై ఎండ్ మొబైల్స్ అయినప్పటికీ కూడా ఈ మొబైల్ కొన్నవారి లగ్జరీ లైఫ్‌కి శుభ చూచికం. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎదుగుతున్న లగ్జరీ పిల్లల కొడుకుల కోసం స్టయల్‌గా రూపోందించడం జరిగింది. మొదట మనం నోకియా ఓరొని గనుక చూసినట్లైతే లగ్జరీ‌కి చిహ్నాం ఈ మొబైల్. నోకియా ఓరొ మొబైల్ ఫోన్ ప్రేమ్, కీస్ కూడా 18K గోల్డ్‌తో తయారు చేయడం జరిగింది. దీంతో చూడడానికి గోల్డ్ మొబైల్ ఉన్నట్లు ఉంటుంది. హై డెపినేషన్ వీడియో ప్లేబ్యాక్ పీచర్‌ని కలిగి ఉండి 3.5 ఇంచ్ AMOLED డిస్ ప్లే కెపాసిటివ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా రే మాత్రం ఎటువంటి గోల్డ్ కవరింగ్‌ లేకుండా చూడడానికి క్లాసీ, స్టయిల్, స్లీక్ మొబైల్. మెటల్ ఫ్రేమ్ వర్క్ తోటి ఎల్‌ఈడి బ్యాక్ లైట్‌తో పాటు ఎల్‌సిడి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా రేని చూడడానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అంతలా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా 8 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కలిగి ఉండి, హైఢెపినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తాయి. 3జి నెట్ వర్క్ అనుగుణంగా వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేయడం కోసం ముందు భాగాన విజిఎ కెమెరా రూపోందించబడింది.

ఇక మల్టీ మీడియా ఎంటర్టెన్మెంట్ విషయంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాలైన వీడియో, ఆడియో ఫార్మెట్ల(MP3, MP4, WAV, WMV, AAC+ )లను సపోర్ట్ చేస్తాయి. కనెక్టివటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి. 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలు EDGE, GPRS లను ఉపయోగించి హై స్పీడ్ 3జి యాక్సెస్‌ చేయవచ్చు. సోనీ ఎరిక్సిన్ 3జి డేటా ట్రాన్ఫర్‌ని 7 Mbpsతో చేస్తే అదే నోకియా ఓరొ మాత్రం డేటాని 10 Mbps స్పీడ్‌తో అందిస్తుంది.

ఇక సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా రే ఖరీదు విషయానికి వస్తే ఇంకా మార్కెట్లోకి విడుదల చేయనప్పటికీ సుమారుగా రూ 45,000వరకు ఉండవచ్చునని అంటున్నారు. అదే నోకియా ఓరొ ఖరీదు మాత్రం రూ 75,000గా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot