బిక్స్బీ / గూగుల్ అసిస్టెంట్ / సిరి, వీటిలో ఏది మీ ఛాయిస్?

Posted By: SSN Sravanth Guthi

ఆఫిల్ - గూగుల్ - అమెజాన్ లాగానే సామ్‌సంగ్ AI సారధ్యంలో "Bixby" అనే వాయిస్ అసిస్టెంట్‌ను "గ్యాలక్సీ S8" సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పరిచయం చేసింది. సామ్‌సంగ్ Bixby ప్రస్తుతానికి దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది. యూఎస్ సహా ప్రముఖ మార్కెట్లలోకి వచ్చే సంవత్సరం ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.  Bixby వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అలాన యాపిల్ సిరితో కంపేర్ చేసి చూసినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొట్టమొదటిగా గూగుల్, సిరి వంటివి..

'ఓకె గూగుల్' & 'హే సిరి' అనేవి వాయిస్ కమాండ్స్‌తో యాక్టివేట్ అవుతాయి. కాని బిక్స్బీ మాత్రం "గెలాక్సీ S8" ఫోన్లలో ఎడమ వైపు ఉన్న బటన్ని ప్రెస్ చెయ్యడం ద్వారా స్టార్ట్ అవుతుంది.

యాప్ ఇంటిగ్రేషన్ :

సామ్సంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, బిక్స్బీ SDKని ఓపెన్ చేస్తే అది థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను కూడా సపోర్టు చేసేదిగా ఉంటుంది. దానికంటే ముందు ఈ బిక్స్బీ ఫోటోలను డైరెక్ట్‌గా తియ్యడానికి / గ్యాలరీ లోపల ఫోటోలను సెర్చ్ చెయ్యడానికి సపోర్టు చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ పూర్తిగా Allo (అలో) మేసేంజర్‌లోను, ఫోటోలు, ప్లే మ్యూజిక్‌ల్లో పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఉంది. ధర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, స్పాటిఫై, నెట్‌ఫిక్స్, ఉబర్ వంటి ఇతర వాటిలో గూగుల్ అసిస్టెంట్ పని చేస్తుంది. సిరి‌లో మాత్రం Yelp
, ఫేస్‌బుక్, వాట్సాప్, పేపాల్, పిన్ట్రస్ట్, ఉబర్ వంటి వాటిలో సపోర్టు‌గా ఉంది. ఈ వాయిస్ అసిస్టెంట్లు అన్ని కాల్స్‌కి, అల్లారం సెట్ చెయ్యడానికి, మెసేజ్‌ల వంటి ఇతర వాటికి ఉపయోగ పడుతున్నాయి.

 

వేరేబుల్స్ :

గూగుల్ అసిస్టెంట్‌ని ఆండ్రాయిడ్ 2.0 నుంచి మనకి  అందుబాటులో ఉంది.ఇదే సమయంలో సిరి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను యాపిల్ ఐఫోన్స్ ద్వారా bixbyని గ్యాలక్సీ S8 ద్వారా యాపిల్, సామ్‌సంగ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. 

స్మార్ట్ హోమ్ :

గూగుల్, సామ్‌సంగ్‌లకు చాలాతద హోమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో సామ్‌సంగ్‌ తమ హోమ్ ఉత్పత్తులో bixbyని ఇన్‌బిల్ట్‌గా అందించే ప్రయత్నం చేస్తోంది. గూగుల్ అసిస్టెంట్‌ని గూగుల్ హోమ్, గూగుల్ వైఫై, నెస్ట్ థర్మోస్టాట్‌లు సపోర్ట్ చేస్తున్నాయి.

సపోర్టు చేసే డివైజెస్:

bixby కేవలం సామ్సంగ్ గెలాక్సీ S8‌లో ప్రారంభమై దాని తర్వాత వచ్చే మోడల్స్‌లో ఇది బాగామై ఉండవచ్చు. సిరి వాయిస్ అసిస్టెంట్‌ను కేవలం యాపిల్ డివైజెస్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మాత్రం ఆండ్రాయిడ్ & గెలాక్సీ S8‌లో కూడా అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Following the suit of Apple, Google and Amazon, Samsung launched its AI powered voice assistant called as Bixby with the launch of Galaxy S8 series of smartphones. Today, we have pitted Bixby against the other two voice assistants -- Google Now and Siri.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot