‘బ్లాక్ కలర్ వేరియంట్’లో గెలాక్సీ నోట్2!

Posted By: Prashanth

‘బ్లాక్ కలర్ వేరియంట్’లో  గెలాక్సీ నోట్2!

 

సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామసంగ్ గెలాక్సీ నోట్2 బ్లాక్ కలర్ వేరియంట్‌ను 2013 ప్రధమాంకంలో అందుబాటులోకి తేస్తున్నట్లు స్విస్ బ్లాగ్ ఆండ్రాయిడ్ స్లాష్ వెల్లడించింది. అయితే, ఈ సమాచారాన్ని సామ్‌సంగ్ వర్గాలు అధికారింగ్ ధృవీకరించాల్సి ఉంది. గెలాక్సీ ఎస్3కు సంబంధించి ఇప్పటికే పలు కలర్ వేరియంట్‌లను సామ్‌సంగ్ అందుబాటులోకి తెచ్చిన నేపధ్యంలో సదరు విషయాన్ని పలువురు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతానికి గెలాక్సీ నోట్2 గ్రే కలర్ వేరియంట్‌‍లో మాత్రమే లభ్యమవుతోంది.

“రజనీకాంత్‌ను మించిన రోబోలు”

గెలాక్సీ నోట్ 2 స్పెసిఫికేషన్‍‌లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువచేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.39,990. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఇతర ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot