జనవరి 30న బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం విడుదల!

Posted By: Super

జనవరి 30న బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం విడుదల!

 

బ్లాక్‌‍బెర్రీ లేటెస్ట్ వర్షన్ ఆపరేటిగ్ సిస్టం ‘బీబీ10’ను జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒకేసారి చేపట్టనున్నారు. ఇదే వేదిక పై రెండు బీబీ10 ఆధారితంగా స్పందించే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిమ్ వర్గాలు ఆవిష్కరించనున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాము విడుదల చేయబోతున్న బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం అత్యుత్తమ మొబైల్ కంప్యూటింగ్ అనుభూతులను చేరువచేస్తుందని రిమ్ సీఈవో తోర్స్టెన్ హెయిన్స్ అన్నారు. ఉన్నత శ్రేణి బ్రౌజర్, అత్యుత్తమ అప్లికేషన్ ఇకోసిస్టం, కట్టింగ్ ఎడ్జ్ మల్టీమీడియా సామర్ధ్యాలను డివైజ్‌లో అనుసంధానించినట్లు ఆయన తెలిపారు. తాము వృద్ధి చేసిన బీబీ10 ఆపరేటింగ్ సిస్టం తాజాగా ఎఫ్ఐపీఎస్ 140-2 సర్టిఫికేషన్ పొందినట్లు చెప్పుకొచ్చారు.

బ్లాక్‌బెర్రీ 10 స్మార్ట్‌ఫోన్ పై ఓ మ్యాటర్ హల్‌చల్!

ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ ఎన్4బిబి (N4BB) బ్లాక్‌బెర్రీకి చెందిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటోను లీక్ చేసింది. ‘లండన్ ’ అనే కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ఎల్ సిరీస్ టచ్‌స్ర్కీన్ హ్యాండ్‌సెట్ బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. బీబీఎమ్, డాక్స్ టూ గో, ఫేస్‌బుక్, స్టోరీ మేకర్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. బ్లాక్‌బెర్రీ లండన్‌గా పేర్కొనబడుతున్న ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అదేవిధంగా 1 జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమరీతో పాటు 8 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరాను నిక్షిప్తం చేసినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot