నెట్‌లో ఆ ఫోటోలు పోస్ట్ చేశారు?

Posted By: Staff

 నెట్‌లో ఆ ఫోటోలు పోస్ట్ చేశారు?

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఫోన్ బ్లాక్‌బెర్రీ 10 స్లైడర్(బీబీ10). 2013లో విడుదల కానున్న ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు అప్‌లోడ్ చేసిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కనువిందుచేస్తున్నాయి. రిమ్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం బ్లాక్‌బెర్రీ 10 కాన్సెప్ట్ ఫోన్.. టచ్, క్వర్టీ వేరియంట్‌లలో విడుదల కానుంది. అయితే, తాజాగా వెబ్‌లో ప్రత్యక్షమైన ఫోటోలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. బీబీ10ను ఏకకాలంలో టచ్ అదేవిధంగా క్వర్టీప్యాడ్ సౌలభ్యతతో ఉపయోగించుకునే విధంగా రిమ్ రూపకల్పన చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లను ధీటుగా ఎదుర్కొవటంలో తడబడుతున్న బ్లాక్‌బెర్రీ, బీబీ10తో వాటికి చెక్ పెట్టే ప్రయత్నంలో నిమగ్నమైంది.

బ్లాక్‌బెర్రీ 4జీ టాబ్లెట్:

రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వై-ఫై వర్షన్ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ టాబ్లెట్ పీసీని 2011లో విడుదల చేసింది. అయితే, వినియోగదారులను ఈ గ్యాడ్జెట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో పీసీ ధరను రూ.27,990 నుంచి రూ.13,490కు తగ్గించంటతో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. తాజాగా రిమ్ 4జీ ఎల్‌టీఈ వర్షన్ ప్లేబుక్‌ను ఈ నెల31 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొదటిగా ఈ డివైజ్‌ను కెనాడాలో విడుదల చేస్తారు. భారత్‌లో ఈ గ్యాడ్జెట్ విడుదలకు మరికొంత పడుతుంది. ధర రూ.30,990.

4జీ ఎల్‌టీఈ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఫీచర్లు:

7 అంగుళాల టచ్ స్ర్కీన్, (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా,

3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

శక్తివంతమైన 4800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot