దారి చూపించనున్న బ్లాక్‌బెర్రీ టార్చ్ మొబైల్స్

By Super
|
BlackBerry Torch
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ కొత్త ఐడియాలతో టార్గెట్లను చేరుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. బ్లాక్‌బెర్రీ పేరంట్ కంపెనీ అయిన కెనడియన్ రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్ద మార్కెట్లోకి కొత్తగా బ్లాక్‌బెర్రీ టార్చ్ 9800 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మూడు కొత్త మొబైల్స్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. బ్లాక్‌బెర్రీ త్వరలో విడుదల చేయనున్నటువంటి ఈ మూడు మొబైల్స్ కూడా బ్లాక్‌బెర్రీ టార్చ్ 9800 స్మార్ట్ ఫోన్‌కి ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అన్ని రకాల ఫీచర్స్‌ని కలిగి ఉంటాయి.

బ్లాక్‌బెర్రీ విడుదల చేసేటుటవంటి మొదటి ఫోన్ 4జి నెట్ వర్క్‌ని సపోర్ట్ చేసేటటువంటి మొట్టమొదటి బ్లాక్‌బెర్రీ మొబైల్ 'బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810'. ఇక మిగిలిన రెండు మొబైల్స్ కూడా 9810కి సమానంగా ఉంటాయి. ఆ రెండు మొబైల్స్ పేర్లు బ్లాక్‌బెర్రీ టార్చ్ 9850, బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860. ఇక బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ గనుక చూసినట్లైతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు గాను స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లుగా రూపోందించబడింది. బ్లాక్‌బెర్రీ టార్చ్ 9800కి, బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810కి మద్య ఉన్న తేడా ఏంటంటే బ్లాక్‌బెర్రీ టార్చ్ 9800లో 1.2 GHz ప్రాసెసర్ ఉంటే అదే బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810లో కేవలం 624 MHz ప్రాసెసర్‌ని అమర్చడం జరిగింది.

బ్లాక్‌బెర్రీ టార్చ్ 9810 మొబైల్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు హై డెఫినేషన్ వీడియోని 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ తో పాటు , 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలైన GPRS, EDGEలను కూడా సపోర్ట్ చేస్తుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఇక మిగిలనటువంటి రెండు మొబైల్స్ బ్లాక్‌బెర్రీ టార్చ్ 9850, బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 కూడా 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p ఫార్మెట్‌ని సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న యూత్‌ని దృష్టిలో పెట్టుకోని రెండు మొబైల్స్ కూడా చాలా స్టయిల్‌గా రూపోందించడం జరిగింది. బ్లాక్‌బెర్రీ టార్చ్ 9860 మొబైల్ జిఎస్‌ఎమ్ సిమ్ కోసం తయారు చేయగా, అదే బ్లాక్‌బెర్రీ టార్చ్ 9850 మొబైల్ సిడిఎమ్ఎ సిమ్ కోసం తయారు చేయడం జరిగింది. ఐతే మూడు మొబైల్స్‌కి సంబంధించిన విడుదల తేదీ కానీ, ధరలను మాత్రం బ్లాక్‌బెర్రీ తయారీ దారు రీసెర్చ్ ఇన్ మోషన్ వెల్లడించలేదు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X