బ్లాక్‌బెర్రీ మరో అద్బుత సృష్టి..!!

Posted By: Super

బ్లాక్‌బెర్రీ మరో అద్బుత సృష్టి..!!

బ్లాక్‌బెర్రీ మొబైల్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ మార్కెట్లోకి కొత్తగా బ్లాక్‌బెర్రీ కర్వ్ 9380 అనే స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9380 స్మార్ట్ ఫోన్ చూడడానికి బ్లాక్ బాడీ ప్యానల్‌తో యూజర్స్‌ని ఇట్టే ఆకట్టుకుంటుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.25 ఇంచ్‌తో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 360*480 ఫిక్సల్‌గా రూపొందించడమైంది.

దీనియొక్క పెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 800 MHz సింగిల్ కోర్ ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడమైంది. బ్లాక్‌బెర్రీ ఓఎస్7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ ఫోన్ రన్ అవుతుంది. బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్స్‌లలో యాక్సల్ రోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ప్రత్యేకంగా డిజిటిల్ కంపాస్ ప్రత్యేకం.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలు మీ సోంతం. ఆటో డిజిటల్ జూమ్ ఫీచర్ కెమెరా ప్రత్యేకత. ఈ స్మార్ట్ ఫోన్‌తో హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720పి ఫార్మెట్లో తీయవచ్చు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సోపర్ట్ చేస్తుంది. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9380 స్మార్ట్ ఫోన్‌తో పాటు ఇంటర్నల్‌గా మెమరీ 1జిబి లభిస్తుంది. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ లను కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా బటన్స్ రూపొందించారు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9380 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9380 మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్: GSM | HSDPA | HSUPA, 850 | 900 | 1800 | 1900 | 2100
ఫామ్ ప్యాక్టర్: Bar | Touchscreen | QWERTY
డిస్ ప్లే: 3.25 touchscreen,65K Colors,320X480
ఆపరేటింగ్ సిస్టమ్: Blackberry OS 7
సిపియు: Qualcomm Snapdragon MSM8255 800MHz CPU
అప్లికేషన్ ప్లాట్ ఫామ్: Java MIDP 2.1, CLDC 1.1
మెమరీ: 512 MB RAM, 1 GB ROM
విస్తరించుకునే మెమరీ: T-Flash/MicroSDHC, up to 32 GB
చుట్టుకొలతలు: 360*480mm
కెమెరా: 5.0 MegaPixels , Digital Zoom, auto focus
బ్లూటూత్: V2.1 A2DP + EDR
వై-పై: 802.11 b/g/n
వైర్ లెస్ డేటా: GPRS | EDGE | 7.2 Mbps HSDPA | 5.76 Mbps HSUPA

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot