మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ రెండు కొత్త మోడళ్లు

Posted By: Staff

మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ రెండు కొత్త మోడళ్లు

స్మార్ట్ ఫోన్స్ సృష్టికర్త అంటే ఒకరకంగా బ్లాక్‌బెర్రీనే అనుకోవచ్చు. వేరే కంపెనీలు స్మార్ట్ పోన్స్‌ని రూపోందించకముందే బ్లాక్‌బెర్రీ కంపెనీ నుండి స్మార్ట్ పోన్‌ని విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ తయారీదారు సంస్ద అయినటువంటి రీసెర్చ్ ఇన్ మోషన్ సంయుక్తంగా కలసి ప్రపంచానికి స్మార్ట్ ఫోన్స్‌ని పరిచయం చేశాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్లాక్‌బెర్రీ కంపెనీ నుండి విడుదలైనటువంటి అన్ని మొబైల్స్‌లో కూడా మల్టీ టాస్కింగ్ పనులు చేసేవిధంగా ఉంటాయి. మల్టీ టాస్కింగ్ అంటే ఉదాహారణకు డాక్యుమెంట్ వీవర్, పవర్ పుల్ ఆర్గనైజర్స్, షెడ్యూల్స్ మొదలగున్నవి అన్నమాట.

ఇక బ్లాక్‌బెర్రీ మొబైల్స్ అందరికి బాగా పరిచయం బ్లాక్‌బెర్రీ ఇనిస్టాంట్ మెయిల్ సర్వీస్. మొబైల్ మార్కెట్లో ఎన్నో మొబైల్ కంపెనీలు స్మార్ట్ పోన్స్ రంగంలో విస్తరిస్తున్నప్పటికీ బ్లాక్‌బెర్రీ మొబైల్స్ ఉండే ప్రత్యేకత వేరు. ఇప్పటికీ బ్లాక్‌బెర్రీ మనుషుల మనసుల్లో నిలచిపోయే మొబైల్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు. బ్లాక్‌బెర్రీని మార్కెట్లో నెంబర్ వన్‌గా నిలబెట్టిన కొన్నిమోడళ్లు ఉన్నప్పటికీ రాబోయే కాలంలో మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడళ్లుని విడుదల చేస్తుంది. ఆ రెండు కొత్త మోడళ్ల సంగతి ఎంటో చూద్దాం. అ రెండు మోడళ్లు బ్లాక్‌బెర్రీ 9930 Bold Touch, బ్లాక్‌బెర్రీ 9810 Torch 2.

బ్లాక్‌బెర్రీ 9930 Bold Touch, బ్లాక్‌బెర్రీ 9810 Torch 2 రెండు కూడా బ్లాక్‌బెర్రీ విడుదల చేసినటువంటి హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్. రెండు మొబైల్స్ కూడా చూడడానికి చాలా చక్కగా డిజైన్ చేయబడి టచ్‌తో పాటు డ్యూయల్ ఇంటర్‌ఫేస్‌ని కలిగి ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా టచ్ స్క్రీన్ ఫెసిలిటిని కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఫిజకల్ క్వర్టీ కీప్యాడ్‌ని కూడా కలిగి ఉన్నాయి. బ్లాక్‌బెర్రీ 9930 Bold Touchతో పోల్చితే బ్లాక్‌బెర్రీ 9810 Torch 2 పెద్ద స్క్రీన్ సైజుని కలిగి ఉంది. బ్లాక్‌బెర్రీ 9930 Bold Touch స్క్రీన సైజు కేవలం 2.8 inches కాగా బ్లాక్‌బెర్రీ 9810 Torch 2 స్క్రీన్ సైజు 3.2 inches. బ్లాక్‌బెర్రీ 9930 Bold Touchతో పోల్చితే బ్లాక్‌బెర్రీ 9810 Torch 2లో స్లైడింగ్ కీప్యాడ్ కూడా కలిగి ఉండడం విశేషం.

BlackBerry Bold Touch 9930 Specifications:

VGA (640

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot