ఫెయిర్‌ఫాక్స్ చేతికి బ్లాక్‌బెర్రీ!

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుని గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా నష్టాల ఊబిలో కొట్టిమిట్టాడుతున్న బ్లాక్‌బెర్రీ కంపెనీ త్వరలో చేతులు మరుతోంది. కెనడాకు చెందిన ప్రముఖ భీమా కంపెనీ ఫెయిర్ ఫాక్స్ 4.7 బిలియన్ డాలర్లు చెల్లించి బ్లాక్‌బెర్రీని సొంతం చేసుకునేందుకు సోమవారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

 ఫెయిర్‌ఫాక్స్ చేతికి బ్లాక్‌బెర్రీ!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ రూ.30 వేల కోట్లు. ఈ మేరకు రెండు సంస్థలూ లెటర్ ఆఫర్ ఇంటెంట్ పై సంతకాలు చేసాయి. ఈ విలువకు సంబంధించి నవంబరు 4లోగా నిజ నిర్దారణ చేయవలసి ఉంటుంది. ఈ ఆరు వారాల వ్యవధిలో బ్లాక్‌బెర్రీ మరింత మంచి ఆఫర్ కోసం వెతుక్కునే అవకాశం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో మంచి అవకాశం దొరికి వేరొక కొత్త భాగస్వామిని బ్లాక్‌బెర్రీ ఎంపిక చేసుకున్నట్లయితే షేరకు 0.30 డాలరు చొప్పున $157 మిలియన్ మొత్తాన్ని ఫెయిర్‌ఫాక్స్‌కు పరిహారం క్రింది చెల్లించవల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లాక్‌బెర్రీ సంస్థల్లో ఫెయిర్‌ఫాక్స్‌కు 10 శాతం వాటా ఉంది.

గత కొంత కాలంగా బ్లాక్‌బెర్రీ... యాపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. దింతో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల అమ్మకాల శాతం గణనీయంగా పడిపోయింది. ఈ నేపధ్యంలో తమ కంపెనీలో పనిచేసే 4,500 సిబ్బందిని త్వరలో తొలగించే అవకాశముందని కూడా బ్లాక్‌బెర్రీ తెలియజేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot