అంతరాయానికి చింతిస్తున్నాం..

Posted By: Staff

అంతరాయానికి చింతిస్తున్నాం..

బ్లాక్ బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేస్తున్నామని తెలిపి కొన్ని రోజులు కాకముందే ఇప్పుడు కొత్త చిక్కులతో సతమతమవుతుంది. ఏంటా కొత్త చిక్కులని అనుకుంటున్నారా.. బ్లాక్‌ బెర్రీ సర్వీసులకు భారత్‌తో పాటు పలు దేశాల్లో నాలుగు రోజులు నుండి అంతరాయం ఏర్పడుతున్న విషయం అందిరికి తెలిసిందే. దీనికి కారణం ప్రధానమైన స్విచ్‌లో ఇబ్బందులు తలెత్తడం వల్లే అంతరాయం ఏర్పడిందని బ్లాక్‌బెర్రీని తయారు చేసిన రిసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ బుధవారం నాడు ప్రకటించింది.

యూరోప్‌లోని వినియోగదారులకు మేసేజ్‌లు బ్రౌజ్‌ చేయడానికి ఇబ్బందులుపడ్డారు. మధ్యప్రాచ్యదేశాలతో పాటు, ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్‌, చిలీ, అర్జెంటీనా దేశాల్లో రిమ్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక స్విచ్‌ లో ఏర్పడిన లోపం కారణంగా పలు దేశాల్లో సర్వీసులకు ఇబ్బందులు కలిగాయని కెనడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్లాక్‌బెర్రీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లాక్‌బెర్రీకి చెందిన వినియోగదారులు సోమవారం నుంచి ఇంటర్నేట్‌ బ్రౌజ్‌ చేయానికి పలు ఇబ్బందులు పడ్డారు. మేసేజ్‌ సర్వీసులు కుప్పలుకుప్పలుగా నిలబడిపోవడంతో వాటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందు చర్యలు తీసుకుంటున్నట్టు రిమ్‌ తెలిపింది.

కస్టమర్లకు ఇబ్బందులు కలిగినందుకు చింతిస్తున్నామని రిమ్‌ ప్రకటించింది. వీలైనంత తొందరగా సర్వీసులను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చింది. మెయిల్‌ పంపిచడం..రీసీవ్‌ చేసుకోవడంలో పలు ఇబ్బందులు ఏర్పడ్డా. అయితే ప్రతి ఒక్క యూజర్‌కు ఇదే ఇబ్బంది కాకుండా వేర్వేరు ఇబ్బందులతో సతమతమయ్యారు. ఇది ఇలా ఉంటే బ్లాక్‌బెర్రీ విడుదల చేసిన క్యూఎన్‌ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొత్తహాంగులు చేర్చి అక్టోబర్ 18న బ్లాక్‌బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'బిబిఎక్స్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండింటి కలయికే ఈ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటున్నారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే యాపిల్ మాక్ ఓఎస్ ఎక్స్ నుండి బిబిఎక్స్ కూడా వచ్చిందని కొంత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot