బ్లాక్‌బెర్రీ కొత్త అవతారం..?

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ కొత్త అవతారం..?

 

సాంకేతిక దిగ్గజాలు ‘రిసెర్చ్ ఇన్ మోషన్’, ‘బ్లాక్‌బెర్రీ’ల విజయోత్సాహం కొంత కాలానికే పరిమితమయ్యింది. ఐఫోన్ ఇతర స్మార్ట్ ఫోన్ల రాకతో ఈ బ్రాండ్ల వైభవం క్రమేపి కనమరుగు కావల్సివచ్చింది. కొల్పోయిన వైభవాన్ని చేజిక్కించునే క్రమంలో ఈ బ్రాండ్లు ‘రిమ్ బ్లాక్‌బెర్రీ బోల్డ్ టచ్ 9220’ పేరుతో ఆడ్వాన్సడ్ వర్షన్ స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేశాయి.

రిమ్ డకోటా (RIM Dakota)గా పిలవబడుతున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ల వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం.. లేటెస్ట్ రిమ్ బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా ఈ ఫోన్ రన్ అవుతుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ MSM8255T ప్రాసెసర్ వేగవంతమైన కంప్యూటింగ్‌కు దోహదపడుతుంది. సిస్టం మెమరీ 768 ఎంబీ, రోమ్ సామర్ధ్యం 7.5 జీబి, క్వీర్టీ కీ బోర్డ్ సులువైన టైపింగ్‌కు దోహదపడుతుంది.

ఫోన్ బరువు 130 గ్రాములు, ప్రధాన కెమెరా సామర్ధ్యం 4.9 మెగా పిక్సల్ నాణ్యమైన క్లారిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు, 1230 mAh బ్యాటరీ వ్యవస్థ పటిష్టమైన బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. బ్లూటూత్ 2.1, వైర్ లెస్ LAN, అసిస్టెడ్ GPS, EDGE/ GPRS, HSDPA వ్యవస్థలు ఫోన్ ఇంటర్నెట్ కనెక్టువిటీ వేగాన్ని మరింత పెంచుతాయి. ఫోన్ ఇంటర్నల్ మెమరీ 7.5 GB, మైక్రో‌‌ఎస్డీ స్లాట్ ఆధారితంగా ఈ జీబిని మరింత పెంచుకోవచ్చు. ధర మరియు ఇతర స్పెసిఫికేషన్ల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting