బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ కేవలం..?

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ కేవలం..?

 

రిసెర్ఛ్ ఇన్ మోషన్ సంస్థ కొత్త తరహా బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ను సమంజసమైన ధరకే అందిస్తోంది. కర్వ్ 9360 (Curve 9360) వేరింయంట్లో డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త బ్లాక్‌బెర్రీ 7 ఆపరేటింగ్ వ్యవస్థను నిక్షిప్తం చేశారు. స్మార్ట్ ఫోన్ శరీరాకృతి ఆకర్షణీయమైన లుక్‌ను సంతరించుకుంది. ఫోన్ ఫ్రంట్ ఛాసిస్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. అదే విధంగా కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది.

ఫోన్ కాన్ఫిగరేషన్ అంశాలను పరిశీలిస్తే 800 MHz ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. 512 ఎంబీ ర్యామ్ పటిష్ట స్టోరేజి వ్యవస్థను కలిగి ఉంటుంది. లోడ్ చేసిన్ బ్లాక్ బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టం స్మూత్‌గా రన్ అవుతుంది. 3జీ వ్యవస్థను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ స్పీడ్ 7.2 Mbps, ఏర్పాటు చేసిన బ్యాటరీ వ్యవస్ధ ఖచ్చితమైన 5 గంటల బ్యాకప్ నిస్తుందని రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) హామి ఇస్తుంది.

స్మార్ట్‌ఫోన్ బరువు 100 గ్రాములు కాగా, పిక్సల్ రిసల్యూషన్ 480 x 360 పిక్సల్స్, టచ్ సెన్సిటివ్ ఆప్టికల్ ట్రాక్‌ప్యాడ్ సౌలభ్యత, ధర కేవలం 19,250. ఇంకేం త్వరపడండి మరి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting