భవిష్యత్ కోసమేనా ఈ పరితపన..?

Posted By: Staff

భవిష్యత్ కోసమేనా ఈ పరితపన..?

 

పతనాన్ని ముందుగానే పసిగట్టిన బ్లాక్‌బెర్రీ రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) మరమ్మతు చర్యలను ప్రారంభించింది. ప్రజల్లో విశ్వసాన్ని కూడబెట్టుకునేందుకు ధర తగ్గింపు అస్త్రాన్ని సంధించింది.  ఈ ప్రణాళికలో భాగంగా ఇటీవల విడుదల చేసిన బ్లాక్‌బెర్రీ కర్వ్ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.11,990కి కుదించి రీ-రిలీజ్ చేసింది.

అభివృద్ధి శాతం ఎక్కువగా ఉన్న ఇండియాలో బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లకు పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి సెల్యులర్ సర్వీస్ ప్రొవైడర్లు బెర్రీ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన టారీఫ్‌లను ప్రవేశపెడుతున్నారు.

బ్లాక్‌బెర్రీ కర్వ్‌తో పాటు ఇతర రిమ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుముఖం పట్టాయి. వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో రిమ్ పలు ప్రత్యేక రిటైల్ స్టోర్‌లను ఏర్పాటు చేయునుంది. ధర తగ్గించిన నేపధ్యంలో రిమ్ ప్లేబుక్ 64జీబి వేరియంట్ ధర కేవలం రూ.24,490. ఈ ప్రయోగం మెరుగైన ఫలితాలను అందిస్తుందని రిమ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting