బ్లాక్‌బెర్రీ క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ల పై రూ.6,000 వరకు ధర తగ్గింపు
కెనాడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ తన క్వర్టీ (QWERTY) కీప్యాడ్ మోడల్ ఫోన్‌ల పై రూ.6,000 వరకు ధర తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గంపును అందుకున్న హ్యాండ్‌సెట్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బ్లాక్‌బెర్రీ 9320 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.11,000 నుంచి రూ.9,900కు (10 శాతం), బ్లాక్‌బెర్రీ 9720 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.15,990 నుంచి రూ.11,900కు (10 శాతం) తగ్గించినట్లు బ్లాక్‌బెర్రీ ఇండియా డైరెక్టర్ సమీర్ భాటియా తెలిపారు. మరో క్వర్టీ మోడల్ ఫోన్ బ్లాక్‌బెర్రీ క్యూ5 పై 30 శాతం ధర తగ్గింపును ఆఫర్ చేస్తునట్లు భాటియా తెలిపారు. ఈ ధర రాయితీ నేపధ్యంలో రూ.19,990 విలువ చేసే క్యూ5 ఫోన్‌ను కేవలం రూ.13,990కే పొందవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








