ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరు..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని సెక్యూరిటీ వ్యవస్థ రోజురోజుకు లోపోబయిష్టంగా మారుతోన్న నేపథ్యంలో కెనడాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ బ్లాక్‌బెర్రీ మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ పోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. బ్లాక్‌బెర్రీ DTEK50 పేరుతో లాంచ్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లతో వస్తోన్న ఫోన్ అని బ్లాక్‌బెర్రీ వెల్లడించింది.

ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరు..?

Read More : రీసెంట్‌గా లాంచ్ అయిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసిన DTEK సెక్యూరిటీ యాప్ ఫోన్‌కు ప్రధాన హైలెట్‌గా నిలవనుంది. యూఎస్ మార్కెట్లో ఈ ఫోన్ ధర $299 (మన కరెన్సీలో రూ.20,000). ముందుగా ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన మార్కెట్లలో విక్రయించున్నారు. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. బ్లాక్‌బెర్రీ DTEK50 స్మార్ట్‌ఫోన్‌లోని 8 ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్లిమ్ బాడీ

బ్లాక్‌బెర్రీ DTEK50 స్మార్ట్‌ఫోన్‌ స్లిమ్ బాడీతో వస్తోంది. ఫోన్ మందం కేవలం 7.4మిల్లీమీటర్లు.

ఫోన్ హార్డ్‌వేర్

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ స్ర్కాచ్ రెసిస్టెంట్ డిస్‌ప్లే, యాంటీ స్మడ్జ్ కోటింగ్, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,

ఫోన్ హార్డ్‌వేర్

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2 TB వరకు విస్తరించుకునే అవకాశం, 2610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కెమెరా, కనెక్టువిటీ

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.0 అపెర్చుర్, పీడీఏఎఫ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 84 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్.

ఆపరేటింగ్ సిస్టం

బ్లాక్‌బెర్రీ DTEK50 స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ప్రత్యేకంగా అభివృద్థి చేసిన సెక్యూరిటీ, ప్రైవసీ ఇంకా ప్రొడక్టవిటీ సూట్‌ను బ్లాక్‌బెర్రీ ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది.

DTEK సెక్యూరిటీ యాప్

బ్లాక్‌బెర్రీ DTEK50 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన DTEK సెక్యూరిటీ యాప్ డివైస్ ఆపరేటింగ్ సిస్టంను నిరంతరం మానిటర్ చేస్తూ సెక్యూరిటీ పరమైన దాడుల నుంచి మిమ్మల్ని ఎల్లప్పుడు అప్రమత్తం చేస్తుంటుంది.

డిస్క్ లెవల్ ఎన్‌క్రిప్షన్

DTEK సెక్యూరిటీ యాప్, సిస్టం మెమరీని హ్యాకర్లు చేధించలేని విధంగా డేటాను చెల్లా చెదరు చేసేస్తుంది. బ్లాక్‌బెర్రీ DTEK50 స్మార్ట్‌ఫోన్ ఎఫ్ఐపీఎస్ 140-2 డిస్క్ లెవల్ ఎన్‌క్రిప్షన్ సపోర్ట్‌తో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BlackBerry DTEK50 Announced: 8 Features of the Most Secure Android Phone You Should Know. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting