స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న బ్లాక్‌బెర్రీ Evolve,Evolve X
కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపనీ బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.
కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపనీ బ్లాక్‌బెర్రీ తన నూతన స్మార్ట్‌ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ Evolve,Evolve X పేర్లతో స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.కాగా బ్లాక్‌బెర్రీ Evolve స్మార్ట్‌ఫోన్ ధర ను రూ.24,990 గా, Evolve X ధరను రూ.34,990గా బ్లాక్‌బెర్రీ కంపెనీ నిర్ణయించింది.అయితే Evolve X స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు చివరినాటికి అమెజాన్ లో అందుబాటులో ఉంటె ,బ్లాక్‌బెర్రీ Evolve మాత్రం సెప్టెంబర్ నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.దీంతో పాటు ఇతర ఆఫర్లు కూడా బ్లాక్‌బెర్రీ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే......

తొలి బ్లాక్ బెర్రీ మొబైల్స్‌గా నిలవనున్నాయి .....
4000ఎంఏహెచ్ బ్యాటరీ, 18:9 రేషియో బెజెల్‌లెస్ స్క్రీన్, వైర్‌లైస్ చార్జింగ్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌తో వస్తున్న తొలి బ్లాక్ బెర్రీ మొబైల్స్‌గా ఈ Evolve,Evolve X స్మార్ట్ ఫోన్స్ నిలవనున్నాయి.

బ్లాక్‌బెర్రీ Evolve ఫీచర్లు....
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, వైర్‌లైస్ చార్జింగ్, ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ Evolve X ఫీచర్లు....
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ , 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, వైర్‌లైస్ చార్జింగ్, ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఆఫర్లు....
బ్లాక్‌బెర్రీ Evolve,Evolve X కొనుగోలు చేసిన వారికి జియో రూ.3,950 క్యాష్‌బ్యాక్‌ను అందివ్వనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లపై 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








